ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pista: రోజూ పిస్తా పప్పు తింటే ఈ 5 ప్రయోజనాలు మీ సొంతం..!

ABN, Publish Date - Jul 09 , 2024 | 01:34 PM

ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ప్రూట్స్ లో పిస్తా కూడా ఒకటి. పిస్తా పప్పును రోజూ తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. అసలు పిస్తా పప్పులో ఉండే పోషకాలేంటి?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో కేలరీలు, పిండి పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ప్రూట్స్ లో పిస్తా కూడా ఒకటి. పిస్తా పప్పును రోజూ తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. అసలు పిస్తా పప్పులో ఉండే పోషకాలేంటి? వీటిని రోజూ తింటే కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..

పోషకాలు..

పొటాషియం, ఫాస్పరస్, విటమిన్-బి6, థయామిన్ కాపర్, విటమిన్ B6, పిండి పదార్థాలు, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, కొవ్వులు, ప్రోటీన్ మొదలైనవన్నీ పిస్తా పప్పులో ఉంటాయి.

ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!


ప్రయోజాలు..

పిస్తాపప్పు తినడం వల్ల ముఖంపై ముడతల ప్రభావం తగ్గుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

శరీరంలో ప్రొటీన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా పిస్తా పప్పును తీసుకోవాలి. ఇది ప్రోటీన్ లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

పిస్తాలో అధిక మొత్తంలో ప్రొటీన్, ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఈ కారణంగా అతిగా తినకుండా చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

పిస్తాపప్పులను తక్కువ పరిమాణంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు పిస్తా పప్పును తప్పనిసరిగా తినాలి.

పిస్తాపప్పులు కంటి చూపును కూడా బలపరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కంటి చూపు సమస్యలు ఉన్న వారంతా దీనిని ఆహారంలో చేర్చుకోవాలి.

5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!


నకిలీ పిస్తా ఇలా గుర్తించాలి..

మార్కెట్లో నకిలీ పిస్తా పప్పు అమ్ముతూ కొనుగోలు దారులను మోసం చేస్తుంటారు. వాటికి ఈ కింది విధంగా గుర్తించవచ్చు.

=> పిస్తా కొనడానికి వెళ్ళినప్పుడు వాటిని ఖచ్చితంగా రుచి చూడాలి. పిస్తా నుండి వేరుశెనగ రుచి వస్తున్నట్టు అనిపిస్తే అది నకిలీ అని అర్థం.

=> పిస్తా నమలడం కష్టంగా అనిపిస్తే అవి చాలా పాతవి అని అర్థం. అలాంటి డ్రై ఫ్రూట్స్ కొనకూడదు.

=> మార్కెట్లో నకిలీ పిస్తా పప్పులు తయారుచేస్తారు. దీని కోసం వేరుశనగను ఉపయోగిస్తారు. పిస్తా పప్పులా కనిపించేందుకు రసాయన పూత పూస్తారు. కాబట్టి పిస్తా కొనుగోలు దగ్గర జాగ్రత్తగా ఉండాలి.

Phool Makhana: ఫూల్ మఖానా ఇలా తినండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!


Period Cramps: పీరియడ్స్ సమయంలో కడుపులో తిమ్మిరికి చెక్ పెట్టే టీలు ఇవి..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 09 , 2024 | 01:34 PM

Advertising
Advertising
<