ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Poha: అటుకులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎవరు తినచ్చు? ఎవరు తినకూడదు?

ABN, Publish Date - Aug 17 , 2024 | 02:21 PM

అటుకులలో కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే అటుకులను అందరూ తినకూడదు. కొందరికి అటుకులు ఆరోగ్యం చేకూర్చడానికి బదులు సమస్యలు తెచ్చిపెడతాయి.

Poha

అటుకులు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. అటుకులను టిఫిన్స్ గానూ, స్నాక్స్ గానూ, స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తారు. అటుకులలో కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే అటుకులను అందరూ తినకూడదు. కొందరికి అటుకులు ఆరోగ్యం చేకూర్చడానికి బదులు సమస్యలు తెచ్చిపెడతాయి. ఇంతకీ అటుకులు ఎవరు తినకూడదో తెలుసుకుంటే..

జీర్ణక్రియ..

చాలామందికి అటుకులు సులభంగానే జీర్ణం అవుతాయి. కానీ జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు, అజీర్ణం, మలబద్దకం, ఎసిడిటీ, ఇంటబుల్ బవెల్ సిండ్రోమ్ మొదలైన సమస్యలు ఉన్నవారు అటుకులను తినకూడదు.

Hot Water: బరువు తగ్గాలంటే వేడి నీరు ఎప్పుడు తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలివి..!



గ్యాస్..

అటుకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా తరచుగా గ్యాస్ సమస్య ఏర్పడటం, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్లాబ్లమ్ ఉన్నవారు అటుకులను తినకపోవడం మంచిది.

మధుమేహం..

అటుకులలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉన్న ఆహారాలను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

అలర్జీలు..

కొందరికి రైస్ అలర్జీ ఉంటుంది. అటుకులను కూడా బియ్యంతోనే తయారు చేస్తారు. రైస్ అలర్జీ ఉన్నవారు అటుకులను తినకూడదు.

ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 17 , 2024 | 02:21 PM

Advertising
Advertising
<