Protein Food: ఈ 5 ఆహారాలు తింటూ ఉంటే చాలు.. పోషకాహార లోపం మిమ్మల్ని టచ్ చేయదు..!
ABN, Publish Date - Jul 01 , 2024 | 04:46 PM
పోషకాహార లోపం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. పోషకాహార లోపం కారణంగా శరీరం బలహీనంగా ఉండటంతో పాటూ బోలెడు అనారోగ్యాలు, చాలా తొందరగా వస్తాయి. మరీ ముఖ్యంగా ఎముకలు, కండరాలు బలహీనంగా ఉండటం, పనులు చేయడంలో ఇబ్బందులు, తొందరగా అలసిపోవడం. ఎప్పుడూ నీరసంగా ఉన్నట్టు అనిపించడం
పోషకాహార లోపం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. పోషకాహార లోపం కారణంగా శరీరం బలహీనంగా ఉండటంతో పాటూ బోలెడు అనారోగ్యాలు, చాలా తొందరగా వస్తాయి. మరీ ముఖ్యంగా ఎముకలు, కండరాలు బలహీనంగా ఉండటం, పనులు చేయడంలో ఇబ్బందులు, తొందరగా అలసిపోవడం. ఎప్పుడూ నీరసంగా ఉన్నట్టు అనిపించడం, గోళ్లు, చర్మం, జుట్టు దారుణమైన స్థితిలోకి మారడం మొదలైనవి ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కేవలం 5 రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చని, ఈ ఆహారాలు తీసుకుంటూ ఉంటే పోషకాహార లోపం దరిచేరదని చెబుతున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..
Life Lesson: జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ 7 విషయాలను వదిలేయడం మంచిది..!
గుడ్లు..
గుడ్లు సమతుల ఆహారంలో ప్రధానంగా పరిగణింపబడే ప్రోటీన్ ఆహారం. గుడ్డులోని తెల్లసొన స్వచ్చమైన ప్రోటీన్. అయితే పచ్చసొనతో సహా మొత్తం గుడ్డులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటూ మరెన్నో పోషకాలు ఉంటాయి.
బాదం..
శరీరంలో అధిక చెడుకొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెజబ్బులు మొదలైన వాటిని తగ్గించడంతో పాటూ బరువు నియంత్రణలో ఉంచడంలోనూ, మొత్తం శారీరక ఆరోగ్యం చేకూర్చడంలోనూ బాదం చక్కగా సహాయపడుతుంది.
చికెన్ బ్రెస్ట్..
ప్రోటీన్ లోపం ఉండకూడదన్నా, ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయాలన్నా చికెన్ బ్రెస్ట్ మంచి ఆప్షన్. చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్ తో పాటూ వివిధ రకాల బి విటమిన్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయి.
Rain Insects: వర్షం పురుగులు ఇంట్లోకి వస్తున్నాయా? ఈ టిప్స్ తో తరిమికొట్టండి..!
కాటేజ్ చీజ్..
కాటేజ్ చీజ్ లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్ బి12, రిబోఫ్లావిన్ (విటమిన్ బి2), అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
గ్రీకు పెరుగు..
గ్రీకు పెరుగు క్రీము లాగా ఉంటుంది. ఇందులో కాల్షియం, విటమిన్ B12, విటమిన్ A, సెలీనియం, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.
Mangolia Flower: సంపెంగ పువ్వులు ఇలా వాడితే ఎన్ని లాభాలో..!
Monsoon Food: వర్షాకాలపు అనారోగ్యాలకు ఈ 5 కూరగాయలే కారణం.. వీటిని తినకండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 01 , 2024 | 04:46 PM