Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఇలా తింటే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
ABN, Publish Date - Jul 13 , 2024 | 01:24 PM
గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, కర్భూజ గింజలను స్వీట్లు, ఇతర ఆహారాలలో తప్ప నేరుగా తినేవారు చాలా తక్కువ. కానీ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని ఇలా తింటే డబుల్ బెనిఫిట్స్ పక్కా..
గుమ్మడికాయలో చాలా ఆరోగ్య ప్రయజనాలు ఉంటాయి. అయితే చాలా తక్కువ మంది దీన్ని ఇష్టపడతారు. ఇక గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, కర్భూజ గింజలను స్వీట్లు, ఇతర ఆహారాలలో తప్ప నేరుగా తినేవారు చాలా తక్కువ. కానీ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుమ్మడి గింజలలో ఫైబర్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. అయితే గుమ్మడి గింజలను ఈ కింది విధంగా తీసుకుంటే మాత్రం వాటి నుండి డబుల్ బెనిఫిట్స్ పొందడం పక్కా అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ గుమ్మడి గింజలను ఎలా తినాలో తెలుసుకుంటే..
ప్రయోజనాలు..
గుమ్మడి గింజలు తీసుకుంటే పురుషులలో స్పెర్మ్ నాణ్యతను మెరుగవుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల గుమ్మడి గింజలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
బ్యాగులు, బాటిళ్లలో వచ్చే ఈ తెల్లని ప్యాకెట్లతో ఇన్ని లాభాలా?
ఎలా తినాలి..
గుమ్మడికాయ గింజలను అల్పాహారం, భోజనం, రాత్రి భోజనంలో.. ఇలా ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే, వాటిని అల్పాహారంగా తినడం ఉత్తమం. వీటిని కాల్చి, స్నాక్స్‌గా తినవచ్చు లేదా ఇతర మొలకెత్తిన గింజలతో కలపవచ్చు.
స్మూతీ..
పెరుగు, పండ్లతో తయారు చేసే స్మూతీస్ లో గుమ్మడి గింజలను చేర్చుకోవచ్చు. ఇది రోజంతా శక్తిని అందించే గొప్ప అల్పాహారం.
గుమ్మడి గింజల బటర్..
పీనట్ బటల్ లాగా గుమ్మడి గింజల బటర్ కూడా ఉంటుంది. దీన్ని బ్రెడ్ లేదా రోటీ, చపాతీ మొదలైన వాటితో తినవచ్చు.
చట్నీ..
గుమ్మడి గింజలను పల్లీలు లాగా ఉపయోగించి చట్నీ తయారుచేసుకుని తినవచ్చు. టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. దీన్ని అన్నంతో లేదా దోసెలు, ఇడ్లీలతో కూడా తినవచ్చు.
యాపిల్ తో పొరపాటున కూడా కలిపి తినకూడదని ఆహారాలు ఇవి..!
తెల్ల జట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 13 , 2024 | 01:24 PM