Rainbow Diet: రెయిన్ బో డైట్ అంటే ఏంటి? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే..!
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:14 PM
రంగురంగుల ఆహారాల కలయికను రెయిన్ బో డైట్ అంటారు. దీన్ని రోజూ ఫాలో అయితే మ్యాజిక్ చేస్తుంది.
పండ్లు, కూరగాయలు అన్నీ ఒకే రంగులోనే ఉండవు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ.. ఇలా వివిధ రంగులలో ఉంటాయి. ఇలా అన్నిరంగులు కలిగిన ఆహారాన్ని రెయిన్ బో ఫుడ్ అని అంటారు. అన్ని రంగులు కలిగిన ఆహారాన్ని రోజూ ఫాలో అయితే దాన్ని రెయిన్ బో డైట్ అని అంటారు. ఈ రెయిన్ బో డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇందులో ఏమేమి చేర్చుకోవచ్చు? తెలుసుకుంచే..
ఆరోగ్యం బాగుండాలన్నా, వయసు మీద పడినట్టు కనబడకూడదన్నా రెయిన్ బో డైట్ బాగా సహాయపడుతుంది. రెయిన్ బో డైట్ లో రంగు రంగుల పండ్లు, కూరగాయలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల శాతం ఎక్కువ. రెయిన్ బో డైట్ ను ఫాలో అయితే శరీరం శుద్ది అవుతుంది. గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం బలపడుతుంది.
మీకు సీతాఫలం అంటే ఇష్టమా.. ఈ నిజాలు తెలిస్తే..
రెయిన్ బో డైట్ లో మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో రంగులో ఒకో రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎరుపు రంగులో లైకోపీన్ ఉంటుంది, ఊదా రంగులో ఆంథోసైనిన్ లు ఉంటాయి. ఇలా వివిధ రంగులలో వివిధ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రెయిన్ బో డైట్ ఎంత వయసు పెరిగినా అందంగా కనిపించాలని అనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిదట. రెయిన్ బో డైట్ ఫాలో అయితే కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
జీర్ణక్రియ..
రెయిన్ బో డైట్ లో ఫైబర్ చాలా ఉంటుంది. ఇది గట్ మైక్రోబయోటాకు సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. వీలైనంతవరకు రెయిన్ బో డైట్ లో ఆకుకూరలను ఎక్కువగా తినాలియ. ఇవి పేగు కదలికలకు చాలా మంచివి.
గుండె జబ్బులు..
సిట్రస్ పండ్లు, ఆకుకూరలు వంటి విటమిన్-సి, విటమిన్-ఇ అధికంగా ఉన్న ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. వీటిలో సహజ సమ్మేళనాలు ఉంటాయి. మంటను తగ్గిస్తాయి. శరీరాన్ని ఆక్సీకరణ నష్టం నుండి కాపాడతాయి.
వామ్మో.. ఈ పండ్లు తినకండి బాబూ.. బరువు పెరుగుతారు..
మానసిక స్థితి..
రెయిన్ బ డైట్ లో ఖనిజాలు, పోషకాలు మానసిక స్థతిని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. చిలకడదుంపలు, అరటిపండ్లు వంటి ఆహారాలలో ట్రిప్టోఫాన్ ను కలిగి ఉంటాయి. ఇది సెరోటోనిన్ మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
బరువు..
బరువు తగ్గడానికి రెయిన్ బో డైట్ సహాయపడుతుంది. నీటి శాతం, ఫైబర్ శాతం అధికంగా ఉన్న రంగురంగుల ఆహారాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి. బీట్ రూట్, నిమ్మకాయ, క్యాబెజీ వంటివి కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
ఈ డ్రింక్స్ తాగితే.. ఈజీగా బరువు తగ్గుతారు..
చర్మానికి..
రెయిన్ బో డైట్ లో చేర్చే ఆహారాలలో విటమిన్-ఎ, విటమిన్-సి ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పని చేస్తాయి.
పిల్లలకు..
రెయిన్ బో డైట్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలకు చాలా మంచిది. ఇది పిల్లల మెదడు అభివృద్దికి సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips: బాబోయ్.. రాగులు మంచి పోషకాహారమే అనుకున్నాం.. కానీ దీంతో ఈ లాభాలు కూడా ఉన్నాయా..
Custard Apple: సీతాఫలాల కాలం.. ఆరోగ్యానికి భలే లాభం..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్నిఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 09 , 2024 | 12:14 PM