ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raw Milk Vs Boiled Milk: పాలు ఎలా తాగితే ఎక్కువ ఆరోగ్యం? పచ్చిగానా లేదా వేడి చేసినవా?

ABN, Publish Date - Jun 08 , 2024 | 12:49 PM

పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా అందరూ రోజూ ఒక గ్లాసు పాలు అయినా తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది. పిల్లలలో మంచి ఎదుగుదల కోసం రోజూ పాలు ఇవ్వడం ఖచ్చితంగా అవసరం. పాలలో తగినంత మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, కొవ్వు ఆమ్లాలు, అనేక ఖనిజాలు ఉంటాయి. ఇందుకే పాలు శక్తివంతమైన పానీయంలో మొదటి స్థానంలో ఉంటాయి.

భారతీయుల ఆహారంలో పాలకు చాలా ప్రాధాన్యత ఉంది. పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా అందరూ రోజూ ఒక గ్లాసు పాలు అయినా తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది. పిల్లలలో మంచి ఎదుగుదల కోసం రోజూ పాలు ఇవ్వడం ఖచ్చితంగా అవసరం. పాలలో తగినంత మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, కొవ్వు ఆమ్లాలు, అనేక ఖనిజాలు ఉంటాయి. ఇందుకే పాలు శక్తివంతమైన పానీయంలో మొదటి స్థానంలో ఉంటాయి. అయితే కొందరు పచ్చిపాలు ఆరోగ్యం అంటే.. మరికొందరు వేడి చేసిన పాలు తాగడమే ఆరోగ్యానికి మంచిదని అంటారు. పాలు ఎలా తాగితే ఎక్కువ ఆరోగ్యం? ఎలా తాగితే ప్రోటీన్ ఎక్కువ లభిస్తుంది? తెలుసుకుంటే..

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?


పచ్చిపాలు..

పచ్చి పాలు అంటే పాశ్చరైజ్ చేయనివి. సింపుల్ గా చెప్పాలంటే పాలు నేరుగా ఆవు పొదుగు నుండి సేకరించినవి పచ్చిపాలు. పాలలో ఉండే వ్యాధికారక బ్యాక్టీరియాను చంపడానికి పాలను ఎక్కువసేపు వేడి చేసే ప్రక్రియ పాశ్చరైజేషన్. పాలను ఇలా వేడి చేస్తే పాల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది.

ప్రయోజనాలు..

వేడి చేసిన పాల కంటే పచ్చి పాలు ఆరోగ్యకరమైనవి, పోషకమైనవి. ఇందులో రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఉండవు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, కడుపులో మంట సమస్యను కూడా తొలగిస్తుంది.

మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


నష్టాలు..

పచ్చి పాలు తాగడం వల్ల ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి. పచ్చి పాలు హానికరమైన బ్యాక్టీరియాకు నిలయం. ఇది తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. పరిశోధనల ప్రకారం పచ్చి పాలలో సాల్మోనెల్లా, ఇ కోలి, లిస్టేరియా, క్యాంపిలోబాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు దీనిని తాగకూడదు.

ఆరోగ్యానికి ఏది బెస్ట్..

పచ్చిపాలలో పోషకాలు ఎక్కువ ఉన్నా వాటిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పోషకాల కోసం పోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. అందుకే వేడి చేసిన పాలను తాగడం మంచిది. పాలను వేడి చేసిన తరువాత పోషకాలు తగ్గినా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఫుడ్ పాయిజన్, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?

మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 08 , 2024 | 12:49 PM

Advertising
Advertising