ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sabudana: సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసా..?

ABN, Publish Date - May 11 , 2024 | 03:28 PM

సగ్గుబియ్యం రుచిగా ఉండటమే కాదు.. దీని వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సగ్గుబియ్యంలో ఉండే పోషకాలేంటి? దీని వల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుంటే..

వేసవికాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా సగ్గుబియ్యం అమ్మకాలు పెరుగుతాయి. చాలావరకు సగ్గుబియ్యాన్ని వడియాలు పెట్టడానికి ఉపయోగిస్తారు. కానీ ఇతర రాష్ట్రాలలో మాత్రం సగ్గుబియ్యాన్ని ఫలహారంగానూ, స్నాక్స్ గానూ ఉపయోగిస్తారు. కొందరు ఉపవాసాల సమయంలోనూ తీసుకుంటూ ఉంటారు. అయితే సగ్గుబియ్యం రుచిగా ఉండటమే కాదు.. దీని వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సగ్గుబియ్యంలో ఉండే పోషకాలేంటి? దీని వల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుంటే..

సగ్గుబియ్యం జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియలో కూడా చాలా తేలికగా ఉంటుంది. ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ప్రేగు సమస్యల వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!


వేసవిలో తేలికపాటి, పోషకమైన ఆహారం కావాలంటే సగ్గుబియ్యాన్ని ఎంచుకోవచ్చు. సగ్గుబియ్యం పిండితో కిచ్డీ లేదా రోటీ తయారు చేసి తినవచ్చు. తక్కువ నూనెతో, నూనె లేకుండా కూడా సాబుదానా టిక్కీని తయారు చేసి తినవచ్చు. సగ్గుబియ్యం కిచిడి కడుపుకు మేలు చేస్తుంది. దీనికి అనేక రకాల కూరగాయలను కూడా జోడించవచ్చు, తద్వారా ఇది మరింత పోషకమైనదిగా మారుతుంది.

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శక్తికి ముఖ్యమైన వనరు. ఉదయపు అల్పాహారంలో దీన్ని చేర్చడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉండచ్చు.

విటమిన్ బి, ఫోలేట్, ఫైబర్, జింక్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు సగ్గుబియ్యంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం.శరీరాన్ని బలంగా మారుస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!

గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 11 , 2024 | 03:28 PM

Advertising
Advertising