ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sugarcane Juice Vs Diabetes: మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా? ఆహార నిపుణులు చెప్పిన నిజాలివీ..!

ABN, Publish Date - May 25 , 2024 | 04:15 PM

చెరకు రసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. హీట్‌స్ట్రోక్‌ నివారిస్తుంది. అయితే చెరకు రసాన్ని మధుమేహం ఉన్నవారు తాగవచ్చా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది.

వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదాన్ని నివారించేందుకు నీరు ఎక్కువగా తాగమని వైద్యులు చెబుతారు. నీరు మాత్రమే కాకుండా శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి, ఆరోగ్యం కోసం చెరకు రసం తీసుకుంటుంటారు. చెరకు రసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. హీట్‌స్ట్రోక్‌ నివారిస్తుంది. అయితే చెరకు రసాన్ని మధుమేహం ఉన్నవారు తాగవచ్చా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలిబుచ్చారు. వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..

చెరకు రసం గుణాలు..

చెరుకు రసంలో సహజ చక్కెర ఉంటుంది. దీనితో పాటు నీరు, ఫైబర్, పోషకాలు ఉంటాయి. ఈ రసం ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. అందుకే చెరకు రసం తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది.

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!


మధుమేహం ఉన్నవారికి మంచిదేనా..

చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం నియంత్రణలో లేని వారు లేదా ఇన్సులిన్ తీసుకునే వారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. అయితే షుగర్ లెవెల్ నార్మల్‌గా ఉంటే వారానికి ఒకసారి చెరకు రసాన్ని తీసుకోవచ్చు. సాధారణ వ్యక్తులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు సుమారు 200 మి.లీ చెరకు రసం తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Viral Video: బైక్ మీద రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట.. వీడియో లీకవడంతో ఏం జరిగిందంటే..!



రక్తంలో చక్కెర రీడింగ్ (HbA1C రీడింగ్) 6 కంటే తక్కువగా ఉండి, ఇన్సులిన్ తీసుకోని వ్యక్తులు చెరకు రసంతో శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను పొందవచ్చు. డయాబెటిస్ రోగులకు అవసరమైన ఫైబర్ ఇందులో ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి సాధారణ చక్కెర స్థాయి ఉన్న వ్యక్తులు దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల సమస్య ఏమీ ఉండదు.

ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 55 కంటే తక్కువ ఉన్న ఆహారాలను మాత్రమే మధుమేహం ఉన్నవారు తీసుకోవచ్చు. చెరకు రసం గ్లైసెమిక్ ఇండెక్స్ 43. ఇది డయాబెటిక్ రోగులకు మంచిదే. అయితే దీన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Hair Health: జుట్టు పలుచగా, బలహీనంగా మారిపోయిందా? అయితే ఈ లోపాలున్నట్టే..!

Vitamin-D: సూర్యరశ్మి లేకపోతేనే కాదు.. ఈ కారణాల వల్ల కూడా విటమిన్-డి లోపం వస్తుంది..!



(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 25 , 2024 | 04:15 PM

Advertising
Advertising