ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sweet Potatoes: చిలకడదుంప అంటే మీకు ఇష్టమా? దీన్ని తింటే యవ్వనంగా ఉండొచ్చా?

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:07 PM

తియ్యగా ఉండే చిలకడదుంపలను తీసుకుంటే యవ్వనంగా ఉండచ్చని అంటుంటారు. అయితే వీటిని ఎప్పుడు ఎలా తీసుకుంటే మేలంటే..

Sweet Potatoes

చిలకడదుంపలు తియ్యగా ఉండే దుంప కూరగాయ. కానీ వీటిని వంటల్లో కంటే ఉడికించి లేదా కాల్చి స్నాక్స్ గా తినడానికే చాలా మంది ఇష్టపడతారు. కొందరు మాత్రం ఈ తీపి దుంపలతో వెరైటీ వంటకాలు తయారు చేస్తారు. చిలకడదుంపలు శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణకు చిలకడదుంపలు చాలా మంచివట. చిలకడదుంపలు ఎప్పుడు తినాలి? ఏ సమయంలో ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? తెలుసుకుంటే..

Hair Growth: ఇంట్లోనే ఈ 3 రకాల హెయిర్ సీరమ్ లు తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!


  • చిలకడదుంపలలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచుతుంది. చర్మానికి సాగే గుణాన్ని(ఎలాస్టిక్) ఇవ్వడం ద్వారా వయసు పెరిగినా సరే చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. వయసుతో పాటు వచ్చే ముడతలు రాకుండా నివారిస్తుంది.

  • చిలకడదుంపలలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. బీటా కెరోటిన్ శరీరంలోకి వెళితే అది విటమిన్-ఎ గా మారుతుంది. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. కొత్త కణాలను సృష్టించడం ద్వారా చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తుంది.

  • చిలకడ దుంపలలో ఉండే బీటా కెరోటిన్ హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. సూర్యుని హానికరమైన కిరణాల వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.

  • చిలకడదుంపలలో నీటి శాతం కూడా ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చిలకడదుంపలలో పొటాషియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంలో ద్రవాల స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. చర్మం మెరుస్తూ మృదువుగా కాంతివంతంగా ఉంటుంది.

White Hair: బీట్రూట్ జ్యూస్ తో భలే మ్యాజిక్.. ఇలా చేస్తే తెల్ల జుట్టు మాయం..!


ఎప్పుడు తినాలి..

చిలకడదుంపలను స్నాక్స్ సమయంలో తీసుకుంటే మంచిది. లేదంటే ఉదయం అల్పాహారంలో భాగంగా కూడా తీసుకోవచ్చు. బయటి ఆహారాలకు అడిక్ట్ అయినవారు వాటిని తీసుకునే సమయంలో వాటికి బదులు చిలకడదుంప తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

చిలకడదుంపను ఉడికించి తీసుకోవడం చాలా మందికి ఇష్టం. రొటీన్ గా తినడం ఇష్టం లేని వారు చిలకడదుంపను శాండ్విచ్ లలోనూ, సలాడ్ లలోనూ జోడించుకోవచ్చు. ఏదైనా సరే సహజంగా తినడమే ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది. కాబట్టి వీటిని ఆవిరి మీద ఉడికించి తినడం మంచిది.

ఇవి కూడా చదవండి..

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ కు పురుగులు పడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 05 , 2024 | 04:07 PM