ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sweetcorn: స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? ఈ నిజాలు తెలుసా?

ABN, Publish Date - Aug 22 , 2024 | 01:13 PM

మొక్కజొన్నలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి అందించడంలో గొప్పగా సహాయపడుతుంది. మొక్కజొన్నలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల కదలికలను సులభతరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది...

sweetcorn

స్వీట్ కార్న్ చాలా వేగంగా ప్రజలలోకి చొచ్చుకొచ్చిన ఆహారం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఉన్న తీపి రుచి దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. వీధుల్లో చాలా వరకు ఉడికించిన స్వీట్ కార్న్ మాత్రమే కాకుండా చీజ్ స్వీట్ కార్న్, బటర్ స్వీట్ కార్న్, మసాలా స్వీట్ కార్న్ అని చాలా రకాలుగా అమ్ముతుంటారు. స్వీట్ కార్న్ ఆరోగ్యకరమైన చిరుతిండిగా పరిగణించబడుతుంది. దీన్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో.. స్వీట్ కార్న్ గురించి చాలా మందికి తెలియని నిజాలేంటో తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే.. ఈ సమస్యలున్న వారికి భలే లాభాలు..!


ఎనర్జీ..

మొక్కజొన్నలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి అందించడంలో గొప్పగా సహాయపడుతుంది.

జీర్ణక్రియ..

మొక్కజొన్నలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల కదలికలను సులభతరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఊబకాయం..

అధిక బరువు ఉన్నవారు ఆహారంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వీట్ కార్న్ లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, కేలరీలు కూడా తక్కువ ఉంటాయి. స్వీట్ కార్న్ తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఈ సమస్యలున్న వారు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు..!


గుండె..

మొక్కజొన్నలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.

చర్మం..

మొక్కజొన్నలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ లో పోరాడి శరీర కణాలకు నష్టం వాటిల్లకుండా చేస్తాయి. తద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 22 , 2024 | 04:01 PM

Advertising
Advertising
<