ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Green Chilli : పచ్చి మిరపకాయలను ఇష్టంగా లాగించేస్తున్నారా.. బీ కేర్ ఫుల్..!

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:40 PM

పచ్చిమిర్చి తినడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అలా అని అతిగా తింటే హాని తప్పదు. వాటిని మితంగా వాడితే ఓకే, ఎక్కువ లాగించేస్తే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది. పచ్చిమిర్చి ఎక్కువగా తింటే ఏం అవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

Green Chilli

Green Chilli : పచ్చిమిర్చి.. దాదాపు అన్ని వంటల్లోనూ వాడుతాం. ఫ్రిజ్‌లో ఏమున్నా లేకపోయినా పచ్చిమిర్చి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. పచ్చిమిర్చి కేవలం వంటల్లో మంచి టేస్ట్ ఇవ్వడమే కాదు.. దాని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. డయాబెటిస్‌ను తగ్గించడంతోపాటు రక్తహీనత, బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మసౌందర్యం కూడా పెంచుతుంది. అలా అని రుచి కోసం అధికంగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పచ్చిమిర్చి ఎక్కువగా తింటే ఏం అవుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది... అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..


పచ్చి మిర్చి సైడ్ ఎఫెక్ట్స్:

1. కడుపు సమస్యలు:

పచ్చి మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అసిడిటీ, గుండెల్లో మంట వంటి కడుపు సమస్యలు వస్తాయి.

2. నోటి పుండ్లు:

పచ్చి మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల నోటిపూత వస్తుంది. అలా వస్తే చాలా అసౌకర్యం కలుగుతుంది. ఫుడ్‌ను కూడా సరిగా తినలేం.

3. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్:

పచ్చి మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని కారణంగా శరీరం ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

4. టీబీ:

పచ్చి మిరపకాయను ఎక్కువగా తీసుకుంటే, అది భరించలేని టీబీ వ్యాధిని కలిగిస్తుంది.

5. గుండెపై ప్రభావం:

పచ్చి మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇది రక్తపోటును పెంచుతుంది.

6. మూత్రపిండాలపై ప్రభావం:

పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

7. బరువు తగ్గడం:

పచ్చి మిరపకాయల అధిక వినియోగం బరువు నిర్వహణను కష్టతరం చేస్తుంది. ఎందుకంటే ఇది మీ ఆకలిని పెంచుతుంది.

8. రక్తహీనత:

పచ్చి మిరపకాయలను ఎక్కువగా తీసుకుంటే రక్తహీనతకు దారి తీస్తుంది.

9. శరీరంలో వేడి:

పచ్చి మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల చాలా మందికి వాపు, ఇతర సమస్యలు వస్తాయి.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)


Also Read:

ఈ కలర్ ద్రాక్ష తింటే మీ గుండె సేఫ్.. అంతేకాకుండా...

ఇలాంటి వారు గోరువెచ్చని నీరు తాగకూడదు.. తాగితే ఇక అంతే..!

రోజూ ఈ ఒక్క పదార్థం తింటుంటే చాలు.. ఎసిడిటీ సమస్య పరార్..

For More Health News and National News

Updated Date - Nov 04 , 2024 | 05:40 PM