Warm Water: ఇలాంటి వారు గోరువెచ్చని నీరు తాగకూడదు.. తాగితే ఇక అంతే..!
ABN, Publish Date - Nov 04 , 2024 | 01:58 PM
మనం ఆరోగ్యంగా ఉండటానికి తినే ఆహారం మాత్రమే కాకుండా తాగే నీరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కొంత మంది ఆరోగ్య ప్రయోజనాలంటూ ఎక్కువగా గోరు వెచ్చని నీరు తాగుతారు. ఇది అందరికీ అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
Warm Water: మనం ఆరోగ్యంగా ఉండటానికి తినే ఆహారం మాత్రమే కాకుండా తాగే నీరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కొంత మంది ఆరోగ్య ప్రయోజనాలంటూ ఎక్కువగా గోరు వెచ్చని నీరు తాగుతారు. జీర్ణక్రియను మెరుగు పర్చడంతో పాటు, కండరాల నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుందని.. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే దగ్గు, అసిడిటీ, జలుబు సమస్యలు దూరం అవ్వడంతో పాటు బరువు కూడా తగ్గుతారని వైద్యులు చెబుతారు. అయితే, ఇది అందరికీ అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా.. కొంత మంది వేడి నీరు తాగడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఎవరు వేడి నీరు తాగొద్దో ఈ కథనంలో తెలుసుకుందాం..
1. జలుబు, దగ్గు:
జలుబు, దగ్గు ఉన్న వారు మరీ ఎక్కువగా ఉన్న గోరువెచ్చని నీరు తాగకపోవడమే మంచిదంటున్నారు. వేడి నీరు తాగడం వలన వారి గొంతులో మంట, చికాకు పెంచుతుందట. జలుబు, దగ్గుతో అప్పటికే ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా ఉంటుందని అంటున్నారు. ఎక్కువ వేడి నీరు కాకుండా కొంచెం వేడిగా ఉండే నీరు తాగడం బెటర్ అని.. అలా తాగడం వలన గొంతుకు కాస్తా ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
2. చిన్న పిల్లలు:
చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఉన్న వేడి నీరును తాగకూడదు. ఎందుకంటే పెద్ద వారితో పోలిస్తే చిన్నపిల్లలకు జీర్ణవ్యవస్ధ సున్నితంగా ఉంటుంది. వేడి నీటిని తీసుకోవడం ద్వారా వారికి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కేవలం సాధారణ నీరు మాత్రమే తాగాలి. లేదంటే కడపు నొప్పి సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది.
3. లివర్ బాధితులు:
లివర్ సమస్యతో బాధపడుతున్న వారు వేడి నీటిని తాగడం మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది వారి లివర్‌పై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. లివర్ బాధితులు చల్లని నీరు తాగాలి అని, వైద్యుల సలహా మేరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లివర్ చాలా సున్నితమైన అవయవం కాబట్టి దానిలో ఏదైనా సమస్య వస్తే, అది శరీరంలోని మిగితా పార్ట్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు.
4. దంతాల సమస్య..
దంతాల సున్నితత్వంతో బాధ పడేవారు ఎక్కువగా ఉన్న వేడి నీటిని తాగడానికి ఇబ్బంది పడుతారు. ఎక్కువగా ఉన్న చల్లటి నీటిని తాగాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ కారణంగానే దంతాల సమస్య ఉన్న వారు సాధారణ నీటిని తాగితే బెటర్ అని అంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Also Read:
రోజూ ఈ ఒక్క పదార్థం తింటుంటే చాలు.. ఎసిడిటీ సమస్య పరార్..
హ్యాంగోవర్ వేధిస్తుందా.. ఇలా చేస్తే మాయం..
ప్రాణాయామంలో ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే.. 100ఏళ్ళ ఆయుష్షు గ్యారెంటీ..
For more Health News
Updated Date - Nov 04 , 2024 | 02:00 PM