ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Thyroid: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆయుర్వేదం చెప్పిన ఈ మూలికలు వాడి చూడండి..!

ABN, Publish Date - Aug 29 , 2024 | 12:31 PM

థైరాయిడ్ పనితీరును నియంత్రణలో ఉంచడంలో కొన్ని మూలికలు బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదం సిఫారసు చేసిన ఆ మూలికలేంటో ..

Thyroid

థైరాయిడ్ గ్రంథి గొంతు కింద మెడ లోపల సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవక్రియకు, శరీరంలో శక్తి స్థాయిలు మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. హృదయ స్పందన రేటును నియంత్రించే హార్మన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు ఉన్నాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకుంటే హైపో థైరాయిడిజం, థైరాయిడ్ పనితీరు చాలా చురుగ్గా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం వస్తాయి. థైరాయిడ్ పనితీరును నియంత్రణలో ఉంచడంలో కొన్ని మూలికలు బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదం సిఫారసు చేసిన ఆ మూలికలేంటో తెలుసుకుంటే..


Soaked Walnuts: వాల్నట్స్ ను నానబెట్టే ఎందుకు తినాలి? అసలు నిజాలు ఇవే..!



దేవకాంచనం..

దేవకాంచనం పుష్పించే జాతి మొక్క. దీన్ని అలంకరణ మొక్కగా పెంచుతారు. ఇది థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. గోయిటర్ లేదా హైపో థైరాయిడిజం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని కషాయం లేదా ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు.

చెంగల్వ కోస్టు..

చెంగల్వ కోస్టు లో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సంప్రదాయ వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో, థైరాయిడ్ రుగ్మతలతో సంబంధం ఉన్న ల7ణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని రుచి చేదుగా ఉంటుంది కానీ ఇది థైరాయిడ్ కు చాలా మంచిది.


Ginger Tea: మీకు అల్లం టీ అంటే ఇష్టమా? ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగకూడదట..!



అల్లం..

అల్లంలో ఉండే శోథ నిరోధక లక్షణాలు జీవక్రియను పెంచుతాయి. హైపోథైరాయిడిజనం ఉన్నవారికి అల్లం మంచిది. దీన్ని టీ, భోజనం, వైద్యుని సలహా మేరకు సప్లిమెంట్ గా కూడా తీసుకోవచ్చు.

శంఖ భస్మం..

శంఖ భస్మం శంఖు షెల్ నుండి తయారవుతుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. థైరాయిడ్ పనితీరుకు తోడ్పడే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఇది మంచిది. అయితే దీన్ని అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి. దీని తయారీ, మోతాదు చాలా జాగ్రత్తగా ఉండాలి.


Migraine: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో సమస్య నుండి బయటపడవచ్చు..!



నల్ల మిరియాలు..

నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది పోషకాలు, మూలికల శోషణను పెంచుతుంది. థైరాయిడ్ కోసం ఉపయోగించే ఇతర మూలికలలో నల్ల మిరియాలను జోడిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో చిటికెడు నల్ల మిరియాల పొడి జోడించాలి.

ఇవి కూడా చదవండి..


Hair Care: ఈ నూనెను 30 రోజులు వాడితే చాలు.. జుట్టు రాలడం ఆగడమే కాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది..!


Low BP: లో బీపీ సమస్య ఉందా? ఈ 3 వస్తువులు వెంట ఉంచుకుంటే మంచిది..!


Uric Acid Vs Ghee: యూరిక్ యాసిడ్ పెరిగితే నెయ్యి తినవచ్చా? వైద్యులు ఏం చెప్పారంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక చేయండి


Updated Date - Aug 29 , 2024 | 12:31 PM

Advertising
Advertising