Coper Bottles: రాగి వాటర్ బాటిల్స్ వాడుతుంటారా.. వాటిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..
ABN, Publish Date - Nov 08 , 2024 | 04:27 PM
రాగి బాటిళ్ళలో నీరు తాగితే ఆరోగ్యమనే కారణంతో చాలా మంది రాగి బాటిళ్లలో నీరు తాగుతారు. కానీ వాటిని శుభ్రం చేయటడం మాత్రం చాలా పెద్ద టాస్క్..
వాటర్ బాటిల్స్ ఇప్పట్లో చాలా సహజంగా మారిపోయాయి. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఏదో ఒక రకమైన వాటర్ బాటిల్స్ ఉండటం గమనించవచ్చు. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు ప్లాస్టిక్ బాటిళ్లకు స్వస్తి చెప్పి స్టీల్ లేదా రాగితో తయారు చేసిన బాటిల్లు వాడుతుంటారు. స్టీల్ గురించి పక్కన పెడితే రాగితో చేసిన బాటిళ్లు వాడటం ఇప్పట్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. రాగి పాత్రలు సహజంగానే తొందరగా నల్లబడుతుంటాయి. వీటిని ప్రత్యేక శ్రద్ద తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇక రెగ్యులర్ గా రాగి బాటిళ్లలో నీరు తాగడం అంటే వాటిని చాలా శుభ్రం గా ఉంచుకోవాలి. లేకపోతే రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎంత మంచి ఫలితాలు ఉంటాయో.. ఆ పాత్రలు శుభ్రంగా లేకపోతే అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉంటాయి. ఇంతకీ రాగి పాత్రలను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా శుభ్రం చేయాలి తెలుసుకుంటే..
బేకింగ్ సోడా.. వెనిగర్..
రాగి పాత్రలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ బాగా సహాయపడుతుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్ల వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని రాగి బాటిల్ లో వేసి మొత్తం పట్టేలా చేయాలి. దీన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత బాటిల్ ను శుభ్రం చేయాలి. ఇలా చేస్తే బాటిల్ శుభ్రం అవుతుంది.
ఉప్పు.. నిమ్మరసం..
బాటిలో పై ఉప్పు వేయాలి. కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేయాలి. బాటిల్ ను నిమ్మరసం వేసిన నీళ్ల టబ్ లో వేయాలి. కొంచెం సేపు నానబెట్టి ఆ తరువాత బాగా రుద్ది కడగాలి. బాటిల్ బాగా శుభ్రం అవుతుంది.
చింతపండు..
చింతపండును రాగి, ఇత్తడి పాత్రలు శుభ్రం చేయడానికి తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. పాత చింతపండును నానబెట్టి మెత్తగా చేసి దాన్ని బాటిల్ లోపల మొత్తం పట్టేలా చేయాలి. అలాగే బాటిల్ మీద కూడా పూయాలి. కొన్ని నిమిషాలు దాన్ని అలాగే ఉంచి ఆ తరువాత దాన్ని బాగా రుద్ది కడగాలి. ఇలా చేస్తే రాగి బాటిల్ శుభ్రం అవడమే కాకుండా మెరుస్తుంది.
కెచప్..
చాలామందికి తెలియని చిట్కా ఇది. కెచప్ ఇప్పట్లో స్నాక్స్ లో తినడానికి వాడతారు. కానీ కెచప్ లో ఉండే ఆమ్ల స్వభావం రాగి బాటిల్ లోపల, బయట ఉన్న నలుపును, మరకలను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కెచప్ పేసి స్పాంజితో శుభ్రం చేయాలి. ఆ తరువాత సాధారణంగా శుభ్రం చేయాలి.
మజ్జిగ..
రాగి బాటిల్లను శుభ్రం చేయడానికి మజ్జిగ కూడా సహాయపడుతుంది. బాటిల్ పైన కొద్దిగా మజ్జిగ వేయాలి. పుల్లగా మారిన మజ్జిగలను బాటిల్ లో నింపాలి. 5 నిమిషాల తరువాత బాటిల్ ను శుభ్రం చేసుకోవాలి. బాగా క్లీన్ అవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Health Tips: బియ్యం కడిగిన నీటిని పడేస్తుంటారా.. వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చంటే.
Updated Date - Nov 08 , 2024 | 04:40 PM