ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uric Acid Vs Ghee: యూరిక్ యాసిడ్ పెరిగితే నెయ్యి తినవచ్చా? వైద్యులు ఏం చెప్పారంటే..!

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:13 PM

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగిన వారు ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి ప్రయత్నంలోనే చాలామంది నెయ్యిని కూడా అవాయిడ్ చేస్తుంటారు. అయితే..

Uric Acid Vs Ghee

యూరిక్ యాసిడ్ పెరగడం గురించి ఈ మధ్యకాలంలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. వీటికి సంబంధించిన వార్తలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగిన వారు ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి ప్రయత్నంలోనే చాలామంది నెయ్యిని కూడా అవాయిడ్ చేస్తుంటారు. అయితే యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ ఉన్నవారు నెయ్యి తినవచ్చని వైద్యులు చెప్తున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

Life Lesson: ఒకరి రహస్యాలు మరొకరికి చెప్పేవారి జీవితం ఎలా ఉంటుందంటే..!



నెయ్యి తింటే బరువు పెరుగుతారనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ నెయ్యిని మితంగా తీసుకుంటే బరువు పెరగరు. చాలామందిలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు వస్తున్నాయి. నెయ్యి అధిక కొవ్వు పదార్థం కావడం మూలాన నెయ్యిని తింటే బరువు పెరిగి కీళ్ల సమస్యలు మరింత పెరుగుతాయని అనుకుంటారు. కానీ నెయ్యి ఇది కీళ్ల నొప్పుల నుండి కాపాడుతుంది.

నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లకు లూబ్రికెంట్ గా పనిచేస్తాయి. అందుకే కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక స్పూన్ నెయ్యిని తింటే మంచిదని, ఇది కీళ్ల నొప్పులు తగ్గిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

పైనాపిల్ తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!


ఆవు నెయ్యి తినడం వల్ల బైలియరీ లిపిడ్ల స్రావం పెరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడేవారు ఈ విషయం తెలుసుకోవాలి.

నెయ్యిలో హైడ్రోజనేటెడ్ కొవ్వు ఉండదు. కాబట్టి ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినండి చాలు..!

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 26 , 2024 | 03:13 PM

Advertising
Advertising
<