ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vitamin B12: విటమిన్-బి12 శరీరానికి అవసరమే.. కానీ దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందంటే..!

ABN, Publish Date - Jun 17 , 2024 | 11:51 AM

ఎక్కువగా మాంసాహారంలో లభించడం వల్ల శాకాహారం తీసుకునేవారిలో విటమిన్-బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. అయితే విటమిన్-బి12 అవసరమైన దానికంటే ఎక్కువ శరీరంలోకి వెళితే ఏం జరుగుతుందంటే..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు, పోషకాలు అవసరమవుతాయి. అలాంటి వాటిలో విటమిన్-బి12 కూడా ఒకటి. శాకాహారంలో ఎక్కువగా లభించని, మాంసాహారంలో మాత్రమే ఎక్కువగా లభ్యమయ్యే విటమిన్-బి1 శరీరంలో నాడీ వ్యవస్థకు, నరాల పనితీరుకు చాలా అవసరం. అయితే ఇది ఎక్కువగా మాంసాహారంలో లభించడం వల్ల శాకాహారం తీసుకునేవారిలో విటమిన్-బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. అయితే విటమిన్-బి12 అవసరమైన దానికంటే ఎక్కువ శరీరంలోకి వెళ్ళడం కూడా ప్రమాదమేనని ఆహార నిపుణులు అంటున్నారు. విటమిన్-బి12 ఎక్కువ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

పిల్లలలో ఏకాగ్తత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!


విటమిన్-బి12 శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. అయితే వయసు, తీసుకునే ఆహారం, శరీరంలో ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని విటమిన్-బి12 ను తీసుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా పెద్దలు రోజుకు 2.4 మి.గ్రా విటమిన్-బి12 తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే అది ఆరోగ్యానికి సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం లేదా సప్లిమెంట్ కంటే ఇంజెక్షన్లు ఎక్కువగా తీసుకోవడం కారణంగా విటమిన్-బి12 శరీరంలోకి ఎక్కువగా వెళుతుంది.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


తలనొప్పి, మైకం, విరేచనాలు, చర్మం పై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, వాపు, జలదరింపు వంటి సమస్యలు అన్నీ విటమిన్-బి12 ఎక్కువగా శరీరంలోకి వెళ్లడం వల్ల జరుగుతాయి. అంతేకాదు.. విటమిన్-బి12 శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శరీరంలో ఉంటే అనాపిలాక్సిస్ అని పిలువబడే అరుదైన, తీవ్రమైన అలెర్జీ సమస్యకు దారితీస్తుంది.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

పిల్లలలో ఏకాగ్తత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 17 , 2024 | 11:51 AM

Advertising
Advertising