Vitamin-D: విటమిన్-డి పుష్కలంగా లభించాలంటే.. సూర్యకాంతిలో ఏ సమయంలో గడపాలంటే..!
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:07 PM
సూర్య కాంతి శరీరానికి సోకినప్పుడు శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ చర్య జరపడం ద్వారా విటమిన్-డి ని తయారుచేస్తుంది. నేటి కాలంలో విటమిన్-డి లోపం కేసులు ఎక్కువ ఉంటున్నాయి.
విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఎముకలు బలంగా ఉంచడంలోనూ, శరీరాన్ని చురుగ్గా ఉంచడంలోనూ, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచడంలోనూ విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్-డి సూర్య కాంతి శరీరానికి సోకినప్పుడు శరీరంలో తయారవుతుంది. సూర్య కాంతి శరీరానికి సోకినప్పుడు శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ చర్య జరపడం ద్వారా విటమిన్-డి ని తయారుచేస్తుంది. నేటి కాలంలో విటమిన్-డి లోపం కేసులు ఎక్కువ ఉంటున్నాయి. అపార్ట్మెంట్లలో ఉండటం వల్ల సూర్య కాంతి లభించక కొందరు.. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసు గదుల్లోనే గడపడం వల్ల కొందరు విటమిన్-డి లోపానికి గురవుతున్నారు. విటమిన్-డి శరీరానికి పుష్కలంగా లభించాలంటే సూర్యుని ఎండలో ఏ సమయంలో గడపడం మంచిది? తెలుసుకుంటే..
White Hair: హెయిర్ డై బదులు ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోండి.. జుట్టు నల్లగా మారుతుంది..!
సరైన సమయం..
సూర్యకాంతి ఏ సమయంలో శరీరానికి సోకినా విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది అనుకుంటే పొరపాటే.. సూర్యుని లేత కిరణాలు శరీరానికి సోకినప్పుడు విటమిన్-డి తయారవుతుంది. అంటే ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్య సమయంలో సూర్యుని కాంతిలో గడపడం వల్ల శరీరానికి విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్-డి లోపిస్తే..
విటమిన్-డి లోపిస్తే శరీరంలో ఎముకలు బలహీన పడతాయి. ఇది మాత్రమే కాకుండా డిప్రెషన్, బలహీనత. తొందరగా అలసిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!
విటమిన్-డి అవసరం ఎంత?
విటమిన్-డి కండరాలను, ఎముకలను బలంగా ఉంచడం, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో, కణాల పెరుగుదలలో, వాపును తగ్గించడంల, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
విటమిన్-డి ఫుడ్స్..
విటమిన్-డి సూర్యుని లేత కిరణాల నుండే కాకుండా ఆహారం నుండి కూడా లభ్యమవుతుంది. ఫ్యాటీ ఫిష్, సాల్మన్, మాకెరెల్, చీజ్, పుట్టగొడుగులు, గుడ్లు, తృణధాన్యాలు, నారింజ రసం, సోయా పాలు వంటివి తీసుకున్నా విటమిన్-డి లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!
శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలు ఇవే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Sep 09 , 2024 | 04:07 PM