ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vitamin-B12: విటమిన్-బి12 సప్లిమెంట్లు వాడుతున్నారా? వీటిని తీసుకోవడానికి సరైన సమయం తెలుసా?

ABN, Publish Date - Oct 04 , 2024 | 05:39 PM

మన శరీరం విటమిన్ B12ను స్వయంగా ఉత్పత్తి చేయలేదు. అందుకే విటమిన్-బి12 ను ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా పొందాలి. కానీ..

Vitamin-b12

శరీరానికి చాలా రకాల విటమిన్లు, పోషకాలు అవసరమవుతాయి. ముఖ్యంగా విటమిన్-బి12 శరీరంలో చాలా కీలక విధులు నిర్వర్తిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, DNA సంశ్లేషణ, నరాల ఆరోగ్యంతో సహా వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరం విటమిన్ B12ను స్వయంగా ఉత్పత్తి చేయలేదు. అందుకే విటమిన్-బి12 ను ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా పొందాలి. విటమిన్‌-బి12 ను ఆహారం నుండి పొందడం కాసింత కష్టం. ఇది మాంసాహారంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ కారణం వల్లనే శాకాహారులకు విటమిన్-బి12 లోపం వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి వారు విటమిన్-బి12 లోపాన్ని భర్తీ చేయడానికి సప్లిమెంట్లను వాడుతుంటారు. అయితే ఈ సప్లిమెంట్లను ఏ సమయంలో తీసుకోవడం మంచిది? విటమిన్-బి12 గురంచి చాలామందికి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుంటే..

Bed Sheet: పరుపు మీద వాడే బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఉతకాలి? చాలా మందికి తెలియని నిజాలివీ..!


విటమిన్-బి12..

విటమిన్ B12 అనేది నీటిలో కరిగే విటమిన్. అంటే ఇది నీటిలో కరికి రక్తప్రవాహంలో నేరుగా శోషించబడుతుంది. నీటిలో కరిగే విటమిన్లు శరీరం ద్వారా త్వరగా ప్రాసెస్ చేయబడతాయి, ఈ కారణంగా ఇవి ఎక్కువ కాలం శరీరంలో నిల్వ ఉండవు.

సమయం..

  • విటమిన్ B12 ఆక్సిజన్‌ను రవాణా చేసే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది. అలసటతో పోరాడుతుంది. పగటిపూట దీన్ని తీసుకోవడం వల్ల సాధారణం కంటే మరింత శక్తివంతంగా ఉండవచ్చు.

  • కొన్ని అధ్యయనాలు నిద్రకు ముందు విటమిన్-బి12 తీసుకోవడం వల్ల నిద్రకు అంతరాయం కలిగిస్తుందని చెబుతున్నాయి. ఎందుకంటే విటమిన్-బి12 శరీరంలో మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది నిద్ర మేల్కునే చక్రాలను నియంత్రించే హార్మోన్. కాబట్టి ఉదయం తీసుకోవడం ద్వారా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి, సిర్కాడియన్ రిథమ్‌ను ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

Food Tips: రోజూ ఆహారంలో సలాడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆహార నిపుణులు ఏం చెప్పారంటే..!


  • చాలామంది విటమిన్ B12 ని ఖాళీ కడుపుతో తీసుకోవాలా లేదా ఆహారంతో తీసుకోవాలా అని గందరగోళానికి గురవుతుంటారు. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు దాని శోషణ ఉత్తమంగా ఉంటుంది. అంటే భోజనానికి అరగంట ముందు లేదా తిన్న 2 గంటల తర్వాత నీటితో తీసుకున్నప్పుడు విటమిన్ కరిగిపోతుంది. రక్త ప్రవాహం ద్వారా గ్రహించబడుతుంది.

  • విటమిన్ B12 ను భోజనంతో పాటు తీసుకోవలసిన అవసరాన్ని చెప్పే ఆధారాలు కూడా ఉన్నాయి. ఏదైనా విటమిన్‌ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కొంతమందికి వికారం లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఈ విటమిన్ శోషణను నెమ్మదిస్తుంది. అందుకే తేలికపాటి కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకున్న తరువాత విటమిన్-బి12 తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

వెల్లుల్లి నీటిని ప్రతిరోజూ తాగుతుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..

రోజులో ఎండుద్రాక్ష ఎన్ని తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యమంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 04 , 2024 | 05:39 PM