ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vitamin-C: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే.. ఈ విటమిన్-సి ఆహారాలు ది బెస్ట్..!

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:33 PM

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా విటమిన్-సి అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్-సి ని సప్లిమెంట్ గా కాకుండా విటమిన్-సి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే

Vitamin-C Foods

శరీరానికి అన్ని రకాల విటమిన్లు అవసరమే.. ఒక్కో విటమిన్ ఒక్కో ప్రయోజనం చేకూర్చుతుంది. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలన్నా విటమిన్-సి చాలా అవసరం. వైద్య పరిభాషలో విటమిన్-సి ని అస్కార్బిక్ యాసిడ్ అని పిలుస్తారు. విటమిన్-సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా విటమిన్-సి అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్-సి ని సప్లిమెంట్ గా కాకుండా విటమిన్-సి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే మంచిది. విటమిన్-సి రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుంటే..

High Protein: ప్రోటీన్ శరీరానికి అవసరమే.. కానీ దీన్ని ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?



  • విటమిన్-సి అధికంగా ఉండే పండ్లను సిట్రస్ పండ్లు అంటారు. ఇవి పుల్లగా ఉంటాయి. నిమ్మకాయలు, ద్రాక్ష, నారింజ, కివి వంటి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకుంటూ ఉండాలి.

  • కూరగాయలలో క్యాప్సికం, ఎరుపు, పసుపు రంగులలో ఉండే బెల్ పెప్పర్స్ లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. పుల్లని పండ్లలో ఉండేదాని కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్-సి బెల్ పెప్పర్స్ లో ఉంటుంది. అంతే కాదు బ్రోకలీ లో కూడా విటమిన్-సి ఉంటుంది. కేవలం విటమిన్-సి మాత్రమే కాకుండా ఫైబర్, ఖనిజాలు, విటమిన్లతో పాటూ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా బ్రోకలీలో పుష్కలంగా ఉంటాయి.

Cinnamon Water: వంటల్లో వాడే దాల్చిన చెక్క దాల్చిన చెక్క గురించి షాకింగ్ నిజాలు.. రోజూ దాల్చిన నీరు తాగితే.. !



  • బెర్రీ జాతికి చెందిన పండ్లలో కూడా విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి పండ్లు ఇమ్యునిటీని పెంచుతాయి.

  • సాధారణ వ్యక్తులకే కాకుండా మధుమేహ రోగులకు కూడా ఆరోగ్యంగా భావించే జామ పండ్లలో విటమిన్-సి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. జామపండ్లను చిన్న పిల్లలు, పెద్దలు, గర్భవతులు.. ఇలా అందరూ తీసుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో కూడా జామపండ్లు బాగా సహాయపడతాయి.

Mosquito's: ఈ 3 రకాల దోమల వల్ల ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి.. అవేంటంటే..!

స్పాట్ జాగింగ్ ఇంత పవరా? రోజూ 10నిమిషాలు చేస్తే ఏం జరుగుతుందంటే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 02 , 2024 | 04:33 PM

Advertising
Advertising
<