Walking: మార్నింగ్ వాక్ చేసే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!
ABN, Publish Date - Aug 18 , 2024 | 01:27 PM
వాకింగ్ చేయడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని సమస్యలున్న వారు అవగాహన లేకుండా వాకింగ్ చేస్తే అది చాలా నష్టాలు తెచ్చిపెడుతుందట.
వాకింగ్ చేయడం ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ లో భాగం. చాలామంది బరువు తగ్గడం కోసం వాకింగ్ చేస్తుంటారు. శరీరం ఫిట్ గా ఉండటం కోసం వాకింగ్ చేసేవారు కూడా ఉంటారు. అయితే వాకింగ్ చేయడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని సమస్యలున్న వారు అవగాహన లేకుండా వాకింగ్ చేస్తే అది చాలా నష్టాలు తెచ్చిపెడుతుందట. డైలీ వాకింగ్ చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటి మీద ఓ లుక్కేస్తే..
త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?
వాకింగ్ వెళ్లేవారు శరీరం ఫిట్ గా ఉండాలనే వెళ్తారు. అయితే గతంలో గాయాలు, నొప్పి ఉన్నవారు, మోకాళ్లకు సంబంధించిన సమస్యలు ఎదుర్కునేవారు వాకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి.
వాకింగ్ ను నెమ్మదిగా మొదలుపెట్టాలి. ముఖ్యంగా వార్మప్ తో వాకింగ్ స్టార్ట్ చెయ్యాలి. వాకింగ్ చేసేటప్పుడు మోకాళ్లు గాయపడకుండా వార్మప్ సహాయపడుతుంది. శరీర కదలికలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆ తరువాత మెల్లగా వేగం పెంచవచ్చు. వాకింగ్ ను వార్మప్ తో ఎలా మొదలుపెట్టామో అదేవిధంగా శరీరాన్ని కూల్ డౌన్ చేస్తూ వాకింగ్ ముగించాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!
వాకింగ్ చేయడానికి కుషనింగ్ ఉన్న తేలికపాటి షూస్ ధరించాలి. ఎల్లప్పుడూ నాణ్యతతో కూడిన షూస్ ఎంపికచేసుకోవాలి. వాకింగ్ లేదా రన్నింగ్ షూస్ మోకాళ్ల మీద ఒత్తిడి పడకుండా చేస్తుంది. మోకాళ్లకు రక్షణ ఇస్తుంది. సౌకర్యంగా లేని షూస్ ఎంపిక చేసుకుంటే ఎక్కువ దూరం నడిచినా, వేగంగా నడిచినా బొబ్బలు వస్తాయి. కాబట్టి మంచి షూస్ ఎంచుకోవాలి.
గతంలో కాళ్లకు గాయాలు అయినట్టయితే 10కి.మీ లేదా అంతకంటే ఎక్కువ దూరం నడవడం మానుకోవాలి. ఎప్పుడూ తక్కువ దూరంతో వాకింగ్ ను మొదలుపెట్టాలి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి మెట్లు ఎక్కడం, ఎత్తు ప్రాంతాలు, కొండలు వంటివి ఎక్కడం చేయాలి. కీళ్లను పటిష్టం చేసేందుకు, కీళ్ల మధ్యన గుజ్జు ఉత్పత్తి బాగా ఉండేందుకు అంజీర్, బాదం వంటివి తినాలి.
టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!
బరువు తగ్గాలని చాలామంది వాకింగ్ చేస్తారు. కానీ బరువు తగ్గడానికి వాకింగ్ మొదలు పెట్టేముందు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వాకింగ్ జాగ్రత్తలు పాటిస్తూ రోజూ వాకింగ్ చేయాలి.
అధిక బరువు ఉన్నవారు, మోకాళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నవారు, లేదా వాకింగ్ చేస్తున్నప్పుడు మోకాళ్లకు ఏదైనా గాయం లాంటివి అయినవారు వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా వాకింగ్ ను కంటిన్యూ చేయకూడదు.
అరచేతులను రుద్దితే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా..?
యవ్వనంగా ఉండటానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 18 , 2024 | 01:27 PM