Walking Tricks: ఈ 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు.. వాకింగ్ లో ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు..!
ABN, Publish Date - Jul 27 , 2024 | 08:56 AM
వాకింగ్ నేటి కాలపు అత్యుత్తమ వ్యాయామం అనడంలో అతిశయోక్తి లేదు. ఇది గుండె ఆరోగ్యం నుండి కీళ్లను బలంగా ఉంచడం వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ కారణంగా ప్రతి రోజూ వాకింగ్ ను తమ విధిగా మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే..
వాకింగ్ నేటి కాలపు అత్యుత్తమ వ్యాయామం అనడంలో అతిశయోక్తి లేదు. ఇది గుండె ఆరోగ్యం నుండి కీళ్లను బలంగా ఉంచడం వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ కారణంగా ప్రతి రోజూ వాకింగ్ ను తమ విధిగా మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. వీరిలో బరువు తగ్గాలనే కారణంతో వాకింగ్ చేసేవారు ఎక్కువ. వాకింగ్ ద్వారా కేలరీలు బర్న్ అయితే బరువు కూడా తగ్గుతారు. అయితే సాధారణంగా అందరూ చేసే వాకింగ్ లోనే 5 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల సాధారణం కంటే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
Health Tips: చిన్న వయసులోనే పెద్ద వారిలా కనబడుతున్నారా? ఈ నాలుగు అలవాట్లే కొంప ముంచుతున్నాయ్..!
వేగం..
వాకింగ్ చేసేటప్పుడు వేగాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. చురుగ్గా నడవడం వల్ల గంటకు ఈజీగా 5 నుండి 6 కిలోమీటర్లు నడవచ్చు. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. కండరాలకు పని పెడుతుంది. దీని వల్ల కేలరీలు బర్న్ కావడమే కాదు.. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. రోజంతా శరీరం చురుగ్గా ఉండటంలో సహాయపడుతుంది. వాకింగ్ చేసేటప్పుడు చేతులను ముందుకు వెనక్కు స్వింగ్ చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి.
పొజిషన్..
నడిచేటప్పుడు పొజిషన్ గమనించుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని నిటారుగా ఉంచి ముందుకు చూస్తూ నడవాలి. భుజాలు, వీపు వంచేసి చేతులను వేలాడగదీస్తూ నడిస్తే ప్రయోజనం ఉండదు. ఇది కండరాల సామర్థ్యాన్ని మెరుగుపరచదు. అదే నిటారుగా నడిస్తే వీపు, భుజాలు మాత్రమే కాకుండా కాళ్లు, పాదాలు, చీలమండలు కూడా ఒక ఫర్పెక్ట్ మోడ్ లోకి వస్తాయి. ఇలా నడిస్తే శరీరంలో కేలరీలు బాగా ఖర్చు అవుతాయి.
Pani Puri: పానీపూరి తిన్నా ఆరోగ్య లాభాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివీ..!
సాఫీగా వద్దు..
నడిచేటప్పుడు సాఫీగా ఉన్న ప్రదేశంలో నడవకండి. దీనికి బదులు ఎత్తు, పల్లం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోండి. ఇది శరీరానికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. ఎత్తు ఉన్న ప్రాంతంలో నడిచేటప్పుడు కండరాలకు శ్రమ పెరుగుతుంది. కేలరీలు బాగా ఖర్చు అవుతాయి. పల్లం ఉన్న ప్రాంతాలకు రాగానే కండరాలకు పని తగ్గుతుంది. అవి కొద్దిసేపు రిలాక్స్ అవుతాయి. అదే విధంగా శరీరం బాగా బ్యాలెన్స్డ్ గా మారుతుంది.
టెక్నాలజీ...
టెక్నాలజీని ఆరోగ్యపరమైన విషయాల కోసం వాడుకోవాలి. ఇప్పట్లో ప్రతి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లో వాకింగ్ స్టెప్ కౌంట్ ఉంటుంది. చాలా రకాల ఫిట్ నెస్ యాప్ లు కూడా ఉన్నాయి. గూగుల్ ఫిట్ లాంటి ట్రాకింగ్ చిట్కాలు ఫాలో అవ్వాలి. హార్ట్ పాయింట్స్ ను గమనించుకోవాలి. రోజూ ఎన్ని అడుగులు వేయాలో.. ఎంత సమయంలో గోల్ ను చేరుకుంటున్నారో, ఎన్ని కేలరీలు ఖర్చు అవుతున్నాయో వీటిలో చూసుకోవచ్చు. ఇది ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవడంలో సహాయపడుతుంది.
BP: ఈ ఆహారాలతో జాగ్రత్త.. ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయ్..!
హైడ్రేట్..
వాకింగ్ చేసే వారు హైడ్రేట్ గా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాకింగ్ కు కొన్ని నిమిషాల ముందు నీరు, కొబ్బరి నీరు, గ్లూకోజ్ వాటర్ వంటివి పుష్కంలగా తాగాలి. ఒక్కరే దూరంగా వాకింగ్ వెళ్తుంటే మీ వెంట ఒక చిన్న సిప్పర్ బాటిల్, అందులో నీళ్లు లేదా నిమ్మరసం నీళ్లు వంటివి ఉంచుకోవాలి. వాకింగ్ మధ్యలో అలసటగా అనిపిస్తే చిన్న బ్రేక్ తీసుకుని నీటిని తాగి మళ్లీ కొనసాగించవచ్చు. ఇది కేలరీలు బర్న్ చేయడానికి మరింత గొప్పగా సహాయపడుతుంది.
ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!
బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లికే చేయండి.
Updated Date - Jul 27 , 2024 | 08:57 AM