ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weight Loss: బరువు తగ్గడానికి ఏ జ్యూసులు తాగితే మంచిది? ఫిట్‌నెస్ నిపుణులు చెప్పిన నిజాలివీ..!

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:50 PM

అధిక బరువు కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. అందుకే ఈ కాలంలో బరువు తగ్గడం గురించి చాలా అవగాహన పెరుగుతోంది. బరువు తగ్గడానికి వ్యాయామం, ఫుడ్ డైట్ తో పాటూ చాలా టిప్స్ కూడా పాటిస్తారు. అయితే కొన్ని జ్యూస్ లు తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చు.

Weight Loss Juices

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అతిగా తిన్నా, అతిగా తాగినా, అతిగా ఏ పని చేసినా పర్యవసానాలు ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటిది ఏకంగా శరీరమే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటే ప్రతి పనిలోనూ ఇబ్బందే ఎదురవుతుంది. ముఖ్యంగా అధిక బరువు కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. అందుకే ఈ కాలంలో బరువు తగ్గడం గురించి చాలా అవగాహన పెరుగుతోంది. బరువు తగ్గడానికి వ్యాయామం, ఫుడ్ డైట్ తో పాటూ చాలా టిప్స్ కూడా పాటిస్తారు. అయితే కొన్ని జ్యూస్ లు తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చు. అవేంటంటే..


ఈ ఆహారాలు తీసుకోండి చాలు.. విటమిన్-డి లోపం మిమ్మల్ని టచ్ చేయదు..!



  • బరువు తగ్గడానికి గ్రీన్ కలర్ జ్యూస్ లు బాగా సహాయపడతాయి. గ్రీన్ యాపిల్, కాలే వంటి వాటితో జ్యూస్ లు తయారు చేసుకుని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కేలరీలు బర్న్ చేయడం సులువు అవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

  • అల్లం ఇమ్యూనిటీని పెంచడంలోనూ, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలోనూ సహాయపడుతుంది. క్యారెట్లు ఫైబర్ ను పుష్కంలగా కలిగి ఉంటాయి. అల్లం, క్యారెట్ రెండింటిని కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగితే బరువు తగ్గవచ్చు. ఇది పొట్ట కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

  • వెయిట్ లాస్ డ్రింక్స్ లిస్ట్ లో బీట్రూట్ డ్రింక్ కు కూడా చాలా మంచి ఆదరణ ఉంది. బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే శరీరానికి ఐరన్ బాగా అందుతుంది.

ఉల్లిపాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల లిస్ట్ ఇదీ..!


  • పాలకూర జ్యూస్ కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పాలకూర జ్యూస్ కేలరీలు బర్న్ చేయడానికి ఉత్తమం. ఇది కేవలం బరువు తగ్గడాన్నే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

  • దోసకాయను చాలామంది నేరుగానే తింటూ ఉంటారు. మరికొందరు దోసకాయను ఇతర జ్యూస్ ల తయారీలో జోడిస్తుంటారు. నీటి శాతం అధికంగా ఉండటం వల్ల దోసకాయ జ్యూస్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

మూత్రం రంగు ఆరోగ్యం గురించి ఏం చెబుతుందంటే..!

ఉసిరికాయ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 05 , 2024 | 01:50 PM

Advertising
Advertising