ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weight Loss: డైట్, జిమ్ కాదు.. ఈ టిప్స్ పాటిస్తే చాలు స్లిమ్ గా అవుతారు..!

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:03 PM

బరువు తగ్గడంలో భాగంగా జిమ్ చేసేవారు, యోగా చేసేవారు, ఆహారాన్ని నియంత్రణలో పెట్టుకునేవారు ఉంటారు. కానీ ఇలా చేస్తే మాత్రం..

Weight loss

బరువు తగ్గడం ఈ కాలంలో చాలామందికి టార్గెట్ అయ్యింది. చాలామంది బరువు తగ్గడం కోసం ఫుడ్ డైట్ ఫాలో అవుతుంటారు. మరికొందరు జిమ్ చేసి బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ జిమ్ కు వెళ్లకుండా, డైటింగ్ చెయ్యకుండా కొన్ని సింపుల్ టిప్స్ తో ఈజీగా బరువు తగ్గవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

  • బరువు తగ్గాలని అనుకునేవారు ఆహారం తీసుకున్న తరువాత ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోకూడదు. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చుంటే శరీరంలో కొవ్వులు విస్తరిస్తాయి. ఇది శరీరంలో పలు భాగాలలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!


  • భోజనాన్ని ఎప్పుడూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాలతో ప్రారంభించకూడదు. ఎందుకంటే కార్బోహేడ్రేట్స్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను త్వరగా పెంచుతాయి.

  • బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయాన్నే టీ, కాఫీలను తాగకూడదు. ఇవి తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో ఆటంకాన్ని కలిగిస్తుంది.

  • సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్ లను తినడం మానుకోవాలి. ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇక ఆహారంలో వేయించిన పదార్ధాలను అస్సలు తినకూడదు.

  • శరీరంలో మెగ్నీషియం లోపం అస్సలు లేకుండా చూసుకోవాలి. శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే శరీర పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో శక్తి స్థాయిలు పడిపోవడంతో పాటూ కండరాలు కూడా బలహీనం అవుతాయి.

రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!


  • బరువు తగ్గాలని అనుకునేవారు మొదట డిప్రెషన్ ను జయించాలి. డిప్రెషన్ కారణంగా కార్టిసాల్ హార్మోన్ బ్యాలెన్స్ కోల్పోయి బరువు తగ్గడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అధిక ఒత్తిడి నాడీ వ్యవస్థను బలహీన పరుస్తుంది.

  • శరీరానికి తగినంత నిద్ర కూడా అవసరం. రోజూ కొంచెం సేపు వ్యాయామం చేస్తుంటే బరువు తగ్గడం కూడా సులభంగా ఉంటుంది. మరొక వైపు నిద్ర కూడా బాగా వస్తుంది.

  • ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉన్న వాటిని చేర్చాలి. ప్రోటీన్ లేకపోవడం వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. ఆహారంలో ప్రోటీన్ తక్కువైతే అనారోగ్యకరమైన ఆహారం తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.

  • బరువు తగ్గడానికి ఎప్పుడూ క్రాష్ డైటింగ్ ను ఎంచుకోకూడదు. ఎందుకంటే ఇది కేలరీలను తగ్గిస్తుంది. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే జీవక్రియ ప్రభావితం అవుతుంది. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది.

  • బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఎక్కువ సేపు ఆకలితో ఉండకూడదు. ఎక్కువ సేపు ఆకలితో ఉండి ఆ తరువాత ఆహారం తీసుకుంటే ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరగడానికే కారణం అవుతుంది. ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి.

మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!

గుడ్లు, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారం గురించి తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 20 , 2024 | 12:03 PM