Weight Loss: ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గుతారు..
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:20 PM
బరువు తగ్గడం చాలామందికి కష్టంగా అనిపిస్తంది. కానీ ఈ 6 టిప్స్ తో ఈజీగా కిలోల కొద్ది బరువు తగ్గుతారు.
అధిక బరువు చాలామందిని ఇబ్బంది పెడుతుంది. బరువు ఎక్కువ ఉన్నవారు ఆహారం తీసుకునే విషయంలో అష్టకష్టాలు పడుతుంటారు. ముఖ్యంగా సాధరణ రోజులలో ఆహారం దగ్గర ఎలా ఉన్నా పండుగ రోజుల్లో మాత్రం పిండి వంటల దగ్గర మనసు లాగేస్తుంది. ఈ కారణంగా పండుగ సమయాల్లో ఎక్కువగా తినేస్తుంటారు. ఆ తరువాత బరువు పెరిగామని బాధపడుతుంటారు. అయితే పండుగలను ఎంజాయ్ చెయ్యాలన్నా, పండుగ వంటలు ఆస్వాదించాలన్నా ముందే కాసింత బరువు తగ్గడం మంచిది. కేవలం 6 టిప్స్ పాటిస్తూ ఉంటే వారం రోజులలోపే ఒకటి నుండి రెండు కిలోల బరువు ఈజీగా తగ్గవచ్చట. ఈ టిప్స్ ను ఇలాగే ఫాలో అయితే కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గవచ్చని అంటున్నారు. ఇందుకోసం ఏం చేయాలంటే..
Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ ఎంత ఉంటే సేఫ్ గా పరిగణిస్తారంటే..
తెల్లటి వస్తువులను మానేయాలి..
తెల్లటి వస్తువులు అంటే తెల్ల చక్కెర, శుద్ధి చేసిన పిండి, ఉప్పును తగ్గించండి. ఎందుకంటే ఉప్పు వల్ల నీరు నిలుపుదల జరుగుతుంది. ఆహారంలో ఉప్పును తగ్గిస్తే శరీరంలో నీరు నిలుపుదల తగ్గుతుంది. నీటి నిలుపుదల కారణంగా బరువు పెరిగిన వ్యక్తులు ఉప్పు తగ్గిస్తే బరువు తగ్గుతారు.
వ్యాయామం..
రోజులో ఏ సమయంలోనైనా 30 నుండి 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇందులో పరుగు, నడక, యోగా లేదా మరేదైనా వ్యాయామాలు ఉంటాయి. ప్రతిరోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వ్యాయామం ఉదయం లేదా సాయంత్రం వేళలో అయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.
భోజనం..
ఫిట్‌నెస్ కోసం సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం. రోజూ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినాలి. ఎలాంటి అనారోగ్యకరమైన భోజనం లేదా స్నాక్స్ తినకూడదు. మంచి డైట్ ఫాలో అవ్వాలి. ప్రోటీన్, పైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి.
Vitamin-D: విటమిన్-డి సప్లిమెంట్లను రోజూ తీసుకున్నా కొందరికి పనిచేయవు ఎందుకని..
పరిమాణం..
ఆహారం తినాలి కానీ ఎంత తింటున్నారో జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే పరిమాణాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా చాలా తేలికపాటి డిన్నర్ తినాలి. రాత్రి భోజనంలో సూప్ లేదా లిక్విడ్స్, రసం వంటివి.. ఖిచిడి, సలాడ్ తీసుకోవాలి. ఇది రాత్రి సమయంలో శరీరంలో ఎలాంటి కొవ్వు నిల్వ కాకుండా చేస్తుంది.
ఆయిల్ వద్దు..
దీపావళికి 2 రోజుల ముందు ఆహారంలో నూనెలు లేకుండా చూసుకోవాలి. అంటే ఈ రెండు రోజుల్లో ఆహారంలో ఎలాంటి నూనె వాడకూడదు. ఎలాంటి నూనె పదార్థాలు తినకూడదు. దీని కోసం ఆహారంలో వీలైనంత ఎక్కువ పండ్లు, సలాడ్, పెరుగు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చాలి.
నీరు..
పనుల హడావిడిలో పడి నీరు త్రాగడం చాలా సార్లు మరచిపోతుంటారు. మారుతున్న వాతావరణం కారణంగా తక్కువ నీరు తాగుతుంటారు. కాబట్టి రోజంతా నీరు ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips: ఈ వ్యక్తులు నెయ్యిని అస్సలు తినకూడదు..
Skin Care: నారింజ తొక్కలు ఇలా వాడితే.. మచ్చలు లేని చర్మం గ్యారెంటీ..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 25 , 2024 | 03:20 PM