ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fruit Diet: ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా.. ఇది మీకోసమే..

ABN, Publish Date - Dec 06 , 2024 | 03:26 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ఆన్ లైన్లో డైట్లు సూచించే ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా పుట్టుకొచ్చారు. కొత్తగా ఫ్రూట్ డైట్ పేరుతో పలు రకాల వీడియోలు కనిపిస్తున్నాయి.. అయితే వీటిపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.. పండ్లను అతిగా తీసుకుంటే ముప్పు తప్పదంటున్నారు..

Fruits

శరీరానికి సమతులాహారం ఎంతో అవసరం. పండ్లు, కూరగాయాలతో పాటు ఆకు కూరలు కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలన్నా పెరగాలన్నా మనం తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే, మనకు సహజంగా లభించే పండ్లను అద్భుతమైన ఆహారంగా చెప్తారు. అనారోగ్యం నుంచి కోలుకునేవారికి, చిన్నపిల్లలకు ఇలా ఒకరనే కాదు ఏ వయసు వారైనా పండ్లను భేషుగ్గా తినొచ్చు. వీటి ప్రయోజనాలను పొందొచ్చు. అయితే, అతి ఎప్పటికీ అనర్థదాయకమే అని తెలుసు కదా. పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ మరీ ఎక్కువగా తింటే వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...

పండ్లలో ఎక్కువ పరిమానంలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది కాలేయానికి చేరినప్పుడు అది దీర్ఘ కాలంలో ఫ్యాటీ లివర్ ను కలుగజేస్తుంది.


ప్రూట్ డైట్‌తో జాగ్రత్త..

ఇక వేగంగా బరువు తగ్గాలనే ప్రయత్నంలో కొందరు ప్రూట్ డైట్ పేరుతో కొత్త ట్రెండ్ తీసుకువస్తున్నారు. అంటే అన్నం, కూరలు, చపాతీల వంటివి కాకుండా పెద్ద మొత్తంలో పండ్లనే ఆహారంగా తీసుకోవడం. ఇది నిజానికి ఏ వైద్యుడు సూచించడని నిపుణులు అంటున్నారు. అధికంగా పండ్లు తీసుకున్నప్పుడు అది కాలేయంపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు.


కడుపు ఉబ్బరం..

అధిక మొత్తంలో పండ్లనే తిని బతికేవారిలో కడుపు ఉబ్బరం, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పండ్లలో చాలా రకాలు అధిక ఫైబర్, సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా కలిగిస్తాయి. సహజ ఆమ్లాలు, చక్కెరలతో కూడిన పదార్థాలేవైనా దంతక్షయానికి దారితీస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే చక్కెర స్థాయిలు ఎక్కువైతే మధుమేహం, ప్యాంక్రియాస్ వంటి సమస్యలు ఉన్నవారికి మరింత ప్రమాదం కలిగించవచ్చు.


పోషకాహార లోపం..

పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ శాతం ఇన్సులిన్ ను నిరోధించడం, ఊబకాయం, మధుమేహం, ఇతర పోషకాహార లోపానికి దారితీయవచ్చు. పండ్లను తీసుకోవడం కంటే పోషకాహారం తీసుకోవడం చాలా మంచిది. ఎలాంటి డైట్ అయినా గుడ్డిగా ఫాలో అవ్వకుండా ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Parenting Tips: మీ పిల్లలు మీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారా? ప్రధాన కారణాలు ఇవే!


Updated Date - Dec 06 , 2024 | 03:26 PM