Dry Grapes: ఎండు ద్రాక్ష ఈ సమయంలో తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది..
ABN, Publish Date - Sep 22 , 2024 | 05:40 PM
Dry Grapes Benefits: ఎండుద్రాక్షను ఎప్పుడు తినాలి.. ఏ సమయంలో తింటే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Dry Grapes Benefits: డ్రైఫ్రూట్స్‌లో ఎండు ద్రాక్షకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలోని పోషకాలు వ్యక్తి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని సరైన సమయంలో తినడం చాలా ముఖ్యం. అప్పుడే గరిష్ట ప్రయోజనం అందుతుంది. మరి ఎండు ద్రాక్ష తినడానికి సరైన సమయం ఏంటో తెలుసుకుందాం..
ఎండు ద్రాక్ష తినడానికి సరైన సమయం..
ఎండు ద్రాక్ష భారతదేశంలో విరివిగా లభిస్తుంది. తీపి, పులుపు రుచి కలిగిన ఈ డ్రైఫ్రూట్ పోషకాల భాండాగారంగా పేరొందింది. అయితే, దీని పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందాలంటే సరైన సమయంలో, సరైన విధంగా తినడం ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎండుద్రాక్ష తినడానికి ఉత్తమ సమయం ఉదయం. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తింటే మేలు జరుగుతుంది. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టడం ద్వారా, దానిలో ఉండే ఫైబర్ మృదువుగా మారుతుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు నయమవుతాయి. అందుకే దీన్ని ఉదయాన్నే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే తింటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
2014 లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. గట్ ఆరోగ్యం ఫైబర్ ఫుడ్‌పై ఆధారపడి ఉంటుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష సహజ భేదిమందుగా పనిచేస్తుందని నిర్ధారించారు. అంతే కాకుండా.. ఎండుద్రాక్షను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా అందుతాయి. రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
చాలా మంది వ్యక్తులు మధ్యాహ్నం అయ్యే సరికి అలిసిపోతుంటారు. అలాంటి సమయంలో స్నాక్స్, కెఫిన్ పదార్థాలు తింటారు. వాటికి బదులుగా ఎండుద్రాక్ష తినడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో సహజమైన తీపి ఉంటుంది. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. శరీరానికి వేగంగా శక్తిని ఇస్తాయి.
ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ హెల్త్‌లోని ఒక అధ్యయనంలో ఎండుద్రాక్ష మంట, సూక్ష్మజీవుల పెరుగుదలకు సంబంధించిన కారకాలను నిరోధిస్తుందని పేర్కొన్నారు. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
Also Read:
కేసీఆర్ కుటుంబం రూ. 2 లక్షల కోట్లు దోచుకుంది
వైసీపీ అవినీతిలో మునిగిపోయిన పార్టీ
For More Health News and Telugu News..
Updated Date - Sep 22 , 2024 | 05:40 PM