White Bread: అల్పాహారంలో బ్రెడ్ జామ్ తింటూంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!
ABN, Publish Date - Jun 30 , 2024 | 11:40 AM
ఆరోగ్యం బాలేనప్పుడో, ఆహారం సహించనప్పుడో బ్రెడ్ తీసుకోవడం చాలామంది చేస్తుంటారు. అయితే ఇప్పటికాలంలో బ్రెడ్ కూడా ప్రధాన ఆహారం అయిపోయింది. అధిక శాతం మంది ఉదయాన్నే అల్పాహారంలో బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు.
ఒకప్పుడు అనారోగ్యం చేసినప్పుడు వైద్యులు పాలు, బ్రెడ్ తీసుకోమని చెప్పేవారు. ఆరోగ్యం బాలేనప్పుడో, ఆహారం సహించనప్పుడో బ్రెడ్ తీసుకోవడం చాలామంది చేస్తుంటారు. అయితే ఇప్పటికాలంలో బ్రెడ్ కూడా ప్రధాన ఆహారం అయిపోయింది. అధిక శాతం మంది ఉదయాన్నే అల్పాహారంలో బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు. కొందరు అయితే పిల్లలకు ఉదయాన్నే బ్రెజ్ జామ్ కాంబినేషన్ ను అల్పాహారంగా ఇస్తుంటారు. అయితే వైట్ బ్రెడ్ ను రోజూ తీసుకోవడం మంచిదేనా? దీని గురించి తెలుసుకుంటే..
వైట్ బ్రెడ్ లో పోషకాలు ఏమీ ఉండవు. ఇది చాలా ప్రాసెస్ చేయబడుతుంది కాబట్టి ఇందులో పోషకాలు అన్నీ నశించిపోతాయి.
Hair Tonic: ఈ హెయిర్ టానిక్ ఉపయోగించి చూడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!
వైట్ బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. వైట్ బ్రెడ్ తిన్న తరువాత రరక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి.
వైట్ బ్రెడ్ లో కార్బోహేడ్రేట్లు, కేలరీలు ఎక్కువ ఉంటాయి. ఇవి బరువువు పెంచడంలో సహాయపడతాయి. దీని వల్ల వైట్ బ్రెడ్ తినేవారిలో బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
గ్లూటెన్ అనే ప్రోటీన్ కొంతమందికి జీర్ణసంబంద సమస్యలు కలిగిస్తుంది. వైట్ బ్రెడ్ లో గ్లూటెన్ ఉంటుంది. దీన్ని తింటే కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాకుండా బ్రెడ్ లో ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్దకంతో పాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
Viral Video: ఇంటి పైకప్పు నుండి వింత శబ్దాలు వస్తున్నాయని మనవరాళ్ల కంప్లైంట్..ఏముందా అని పగలగొట్టి చూస్తే దిమ్మతిరిగే షాక్..!
బ్రెడ్ లో తరచుగా ప్రజర్వేటివ్ లు, కృత్రిమ రంగులు, కృత్రిమ సువాసనలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం చేసేవే.
కార్బోహైడ్రేట్ లు అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుంది.
Bald Head: పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేకపోతే బట్టతల రావడం ఖాయం..!
Bill Gates: బిల్ గేట్స్ సక్సెస్ కావడానికి ఈ అలవాట్లే కారణం..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లికే చేయండి.
Updated Date - Jun 30 , 2024 | 11:40 AM