పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12మంది సైనికులు మృతి
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:12 AM
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు మృతిచెందారు.
పెషావర్, నవంబరు20: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. బన్ను జిల్లాలోని మలిఖెల్ ప్రాంతంలో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద ఆత్మాహుతి దాడి సందర్భంగా జరిగిన పేలుడులో భారీ విధ్వంసం జరిగింది. సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉగ్రవాదులు జరిపిన మరో దాడిలో ఆరుగురు సైనికులు మృతిచెందారు. మరో ఘటనలో ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు ఏడుగురు సైనికులను అపహరించి వదిలిపెట్టారు. 10 రోజుల క్రితం క్వెట్టా రైల్వే స్టేషన్ వద్ద ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 26 మంది చనిపోగా మృతుల్లో 14 మంది సైనికులున్నారు. బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఉగ్రవాద ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సైనిక చర్యకు అనుమతిచ్చారు.
Updated Date - Nov 21 , 2024 | 04:13 AM