Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్
ABN, Publish Date - Dec 29 , 2024 | 07:04 AM
175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.
దక్షిణ కొరియా(SouthKorea)లోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ఓ దుర్ఘటన (PlaneCrash) దేశాన్ని శోకంలో ముంచెత్తింది. ఓ విమానం రన్‌వేపై నుంచి దూసుకెళ్లి గోడను ఢీకొట్టి కుప్పకూలడంతో ఇప్పటివరకు 28 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో 175 మంది ప్రయాణికులు, మరో 6 మంది ఫ్లైట్ అటెండెంట్లు విమానంలో ప్రయాణిస్తున్నట్లు యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది. విమానం జెజు ఎయిర్‌కు చెందినది. థాయ్‌లాండ్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇప్పటివరకు ఒక వ్యక్తి సేఫ్
విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు అది రన్‌వేపై నుంచి దూసుకెళ్లిన క్రమంలో పక్షలు ఢీకొట్టగా పేలిపోయిందని చెబుతున్నారు. వెలుగులోకి వచ్చిన వీడియోలో పేలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో భారీగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. బారికేడ్లను తొలగించి సహాయం చేస్తున్నారు. ఈ రెస్క్యూ కార్యకలాపాల్లో ఇప్పటివరకు ఒక వ్యక్తి సజీవంగా బయటపడ్డాడు.
ప్రమాదానికి కారణమిదేనా..
ఈ ఘటన గురించి ఆరా తీసిన అధికారులు విమానంలో సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రకటించారు. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, దక్షిణ కొరియాలో ప్రధానంగా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే విమాన మార్గాలలో ఒకటిగా ఉంది.
ఈ ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడంతో ఈ ప్రమాదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ప్రమాదానికి గురైన కుటుంబాలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సహాయ బృందాలు వారి పని కొనసాగిస్తున్నారు. ఈ దుర్ఘటన గురించి మరిన్ని పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి.
ఇవి కూడా చదవండి:
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More International News and Latest Telugu News
Updated Date - Dec 29 , 2024 | 07:42 AM