కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:13 AM
కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ నుంచి రష్యా వెళుతున్న విమానం అక్టౌ విమానాశ్రయానికి 3 కి.మీ. దూరంలోని భూముల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు.
38 మంది ప్రయాణికుల మృతి
రష్యాకు వెళ్తున్న అజర్‌బైజాన్ విమానంలో సాంకేతిక లోపం
అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఘోరం
మాస్కో, డిసెంబరు 25: కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ నుంచి రష్యా వెళుతున్న విమానం అక్టౌ విమానాశ్రయానికి 3 కి.మీ. దూరంలోని భూముల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. విమానంలో ఐదుగురు సిబ్బంది సహా 67 మంది ఉన్నారు. అజర్‌బైజాన్‌కు చెందిన ఈ విమానం రాజధాని బాకూ నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళుతోంది. అక్కడ మంచు వల్ల దారి మళ్లించారు. కూలిపోవడానికి ముందు అక్టౌలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానం పక్షుల గుంపును ఢీకొందని, దాంతో పైలట్లు ‘డిస్ట్రెస్ సిగ్నల్’ పంపారని సమాచారం. అక్కడ దిగే క్రమంలోనే కీలక వ్యవస్థలు విఫలమయ్యాయి. విమానం అకస్మాత్తుగా కిందకు వచ్చేయడం, అంతలోనే కూలి మంటలు రేగిన దృశ్యాలు ఓ వీడియోలో కనిపించాయి.
Updated Date - Dec 26 , 2024 | 05:13 AM