ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Boat Sinks: మునిగిన పడవ.. 49 మంది మృతి, 140 మంది గల్లంతు

ABN, Publish Date - Jun 12 , 2024 | 08:37 AM

యెమెన్‌(Yemens)లో ఘోర విషాదం చోటుచోసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తా(boat sinks) పడటంతో 49 మంది మృత్యువాత చెందగా, 140 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా వెళుతుండగా సోమవారం సాయంత్రం యెమెన్ దక్షిణ తీరంలో పడవ మునిగిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

49 dead, 140 missing boat sinks Yemen

యెమెన్‌(Yemen)లో ఘోర విషాదం చోటుచోసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తా(boat sinks) పడటంతో 49 మంది మృత్యువాత చెందగా, 140 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా వెళుతుండగా సోమవారం సాయంత్రం యెమెన్ దక్షిణ తీరంలో పడవ మునిగిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 71 మందిని రక్షించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) తెలిపింది. మృతి చెందిన వారిలో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు.


అయితే ఆ పడవలో దాదాపు 260 మంది సోమాలియన్లు(somalians), ఇథియోపియన్లు ఉన్నారని IOM వెల్లడించింది. ఈ వలసదారులంతా హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి 97,000 మంది వలసదారులు గత సంవత్సరం యెమెన్ చేరుకున్నారు. ప్రతి ఏటా వేలాది మంది ఆఫ్రికన్ వలసదారులు సౌదీ అరేబియాకు చేరుకోవడానికి యెమెన్ నుంచి తూర్పు మార్గం ద్వారా ఎర్ర సముద్రం దాటడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.


మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం వారు చేసే ప్రయత్నంలో భాగంగా వారి ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తూర్పు ఆఫ్రికా(East Africa)లోని ఇతర ప్రాంతాల నుంచి పని వెతుక్కుంటూ గల్ఫ్ దేశానికి చేరుకోవడానికి యెమెన్ ఒక ప్రధాన మార్గం. యెమెన్‌లో దాదాపు దశాబ్ద కాలంగా అంతర్యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, 2021 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం యెమెన్‌లోకి వచ్చే వలసదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని IOM గత నెలలో తెలిపింది. ప్రస్తుతం యెమెన్‌లో దాదాపు 380,000 మంది వలసదారులు ఉన్నారు.


ఇది కూడా చదవండి:

Plane crash: విమానం కుప్పకూలి మలావీ ఉపాధ్యక్షుడితో సహా 9 మంది మృతి


iPhones : ఐఫోన్లకూ జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీ హంగులు

Read Latest International News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 09:46 AM

Advertising
Advertising