Bus Fell: లోయలో పడిన ప్రయాణికుల బస్సు.. 45 మంది మృతి
ABN, Publish Date - Mar 29 , 2024 | 06:30 AM
46 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బస్సు(bus) ఆకస్మాత్తుగా లోయలో(valley) పడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు(fire) చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాత చెందగా, ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
46 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బస్సు(bus) ఆకస్మాత్తుగా 165 అడుగుల లోయలో(valley) పడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు(fire) చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాత చెందగా, ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన దక్షిణాఫ్రికా(South Africa) లింపోపోలోని(Limpopo) మమట్లకల సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అక్కడి అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వంతెనపై ఉన్న బారికెడ్లను ఢీకొట్టి 165 అడుగుల లోతున్న లోయలో బస్సు(bus) బోల్తా పడినట్లు దక్షిణాఫ్రికా రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని వెల్లడించారు. ప్రయాణీకుల బస్సు దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి లింపోపోలోని మోరియా అనే పట్టణానికి ప్రజలను తీసుకువెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
అయితే వారంతా ఈస్టర్ పండుగ నేపథ్యంలో చర్చికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. లోయలో పడిన తర్వాత బస్సు కాలిపోవడంతో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అక్కడి అధికారులు తెలిపారు. మరికొందరు శిథిలాల లోపల చిక్కుకుని, ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా ఉన్నందున గురువారం సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: పెళ్లింట పెను విషాదం
Updated Date - Mar 29 , 2024 | 06:57 AM