Sunita Williams : అంతరిక్షంలో చిక్కి..
ABN, Publish Date - Nov 11 , 2024 | 05:30 AM
ఐదు నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ స్ఎస్)వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతావిలియమ్స్ (59) ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది!
న్యూయార్క్, నవంబరు 10: ఐదు నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ స్ఎస్)వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతావిలియమ్స్ (59) ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది! వెళ్లేటప్పుడు ఆరోగ్యంగా కనిపించిన సునీత.. సెప్టెంబరు 24న తీసిన ఫొటోల్లో బాగా బరువు తగ్గిపోయి, బక్కచిక్కిపోయి, బుగ్గలు పీక్కుపోయి.. పదేళ్ల వయసు పైబడినట్టుగా కనిపిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది జూన్ 5న ఆమె స్టార్‌లైన్ స్పేస్‌క్రా్‌ఫ్టలో ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం జూన్ 14నే ఆమె తిరిగి రావాల్సి ఉంది. కానీ, వ్యోమనౌకలో హీలియం లీకేజీ వల్ల తిరుగుప్రయాణం సాధ్యం కాలేదు. స్పేస్‌ఎక్స్ వ్యోమనౌకలో వచ్చే ఫిబ్రవరిలో ఆమెను భూమికి తీసుకురానున్నట్టు నాసా ప్రకటించింది. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు నాసా ప్రకటన చేసినప్పటికీ.. నానాటికీ క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. నాసాలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినదాని ప్రకారం.. వ్యోమగాములు రోదసిలో ఉండగా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన హైక్యాలరీ ఆహారాన్ని ఆమె తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఎక్కువకాలంపాటు రోదసిలో ఉంటే.. ఆ ప్రభావం వ్యోమగాముల ఆరోగ్యంపై పడుతుంది. పురుషులతో పోలిస్తే మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. బరువు కోల్పోవడం, కండరాలు దెబ్బతినడం, ఎముకలు బోలుగా మారడం వంటి సమస్యలతో బాధపడతారు. ప్రస్తుతం సునీత కోల్పోయిన బరువును తిరిగి పొంది, మునుపటిలా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 3,500 నుంచి 4000 క్యాలరీల ఆహారం తినాలని నాసా వర్గాల సమాచారం.
Updated Date - Nov 11 , 2024 | 05:30 AM