ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Australia : బంగారు గనిపై ఘర్షణ

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:36 AM

బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియాలో హింస చెలరేగింది. అల్లర్లు, విధ్వంసాలు, కాల్పులతో అట్టుడికింది. భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు అప్పగించి ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేంతగా పరిస్థితి దిగజారింది.

  • పపువా న్యూగినియాలో 30 మంది కాల్చివేత!

పోర్ట్‌ మోర్స్‌బై, సెప్టెంబరు 16: బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియాలో హింస చెలరేగింది. అల్లర్లు, విధ్వంసాలు, కాల్పులతో అట్టుడికింది. భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు అప్పగించి ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేంతగా పరిస్థితి దిగజారింది. ఇదంతా.. ఈ ఏడాది మే నెలలో కొండచరియలు విరిగిపడి, 2 వేల మంది ప్రాణాలను బలిగొన్న బంగారు గని ఉన్న ప్రాంతంలోనే జరగడం గమనార్హం. ఆస్ట్రేలియాకు సమీపాన ఉండే ఓషియానియా దేశమైన పపువా న్యూ గినియాలో న్యూ పోర్గెరా ప్రాంతంలోని బంగారు గనిని ఆగస్టులో సకార్‌ అనే గిరిజన తెగ ఆక్రమించుకుంది. వాస్తవానికి ఈ ప్రాంతంపై హక్కులు పయాండె తెగకు ఉన్నాయి. దీంతో రెండింటి మధ్య ఘర్షణ జరుగుతోంది. ఆదివారం వరుస ఘటనల్లో 300 పైగా రౌండ్లు కాల్పులు జరిగాయి. 30 మంది మృతిచెందారు. ఈ సంఖ్య 50కు చేరొచ్చని పోలీసులు చెబుతున్నారు.

క్షతగ్రాతులూ భారీగానే ఉన్నారని పేర్కొన్నారు. ఆందోళనల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. అక్రమ మైనింగ్‌ చేస్తున్నవారు, వలసదారులు హింసకు దిగుతూ స్థానికులు, భూమి హక్కుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వివరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆయుధాలతో బహిరంగంగా తిరుగుతూ, ఎవరినైనా బెదిరిస్తూ కనిపించిన వారిని కాల్చివేయాలని ప్రభుత్వ ఆదేశాలిచ్చింది.

కాగా, పపువా న్యూగినియాలో జాతుల ఘర్షణ సాధారణమే. కానీ, కొన్నాళ్ల నుంచి ఆటోమేటిక్‌ ఆయుధాల వినియోగంతో హింస పెరుగుతోంది. మే నెలలో కొండచరియలు విరిగిపడింది ప్రొగెరా గని ప్రాంతంలోనే. ఇది కెనడా జాతీయుడి ఆధీనంలో ఉంది. ఒకప్పుడు దేశ వార్షిక ఎగుమతుల్లో 10 శాతం ఆదాయం ఈ గని నుంచే వచ్చేది. అయితే, జాతుల ఘర్షణ, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో కొన్నాళ్ల కిందటే మూతపడింది. రెండేళ్ల కిందట సైతం అల్లర్లు చెలరేగి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ నెల మొదట్లో పపువాలో పర్యటించిన సందర్భంగా ఘర్షణలకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.

Updated Date - Sep 17 , 2024 | 03:37 AM

Advertising
Advertising