Sydney : ఒలింపిక్స్ కోసం వేలు తీసేశాడు!
ABN, Publish Date - Jul 20 , 2024 | 04:38 AM
ఏదైనా పెద్ద టోర్నీకి ముందు గాయాలైతే క్రీడాకారులు కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అప్పటికీ వీలు కాకుంటే.. అత్యంత ఆవేదనతో టోర్నీకి దూరమవుతారు. ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టు సభ్యుడు మాథ్యూ డాసన్ (30) మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు మాథ్యూ డాసన్ కఠిన నిర్ణయం
సిడ్నీ, జూలై 19: ఏదైనా పెద్ద టోర్నీకి ముందు గాయాలైతే క్రీడాకారులు కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అప్పటికీ వీలు కాకుంటే.. అత్యంత ఆవేదనతో టోర్నీకి దూరమవుతారు. ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టు సభ్యుడు మాథ్యూ డాసన్ (30) మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
మైదానంలో డిఫెండర్‌గా పోరాట పటిమ చూపే అతడు.. బయట కూడా పరిస్థితులతో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల డాసన్ కుడిచేతి ఉంగరపు వేలికి పెద్ద గాయమైంది.
శస్త్రచికిత్స చేయించుకున్నా.. కోలుకునేందుకు సమయం పట్టనుంది. కానీ, ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. డాసన్ పాల్గొనే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏకంగా వేలి పైభాగాన్ని తొలగించుకున్నాడు.
ప్రస్తుతం అతడు జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కాగా, ఆరేళ్ల కిందటి హాకీ స్టిక్ తగిలి డాసన్ కంటికి చూపు పోయేంతటి గాయమైంది. అప్పుడు కూడా స్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో నిలిచాడు. కోలుకుని మైదానంలో అడుగుపెట్టాడు.
Updated Date - Jul 20 , 2024 | 04:38 AM