ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Australia: గాల్లో విమానం.. న్యూడ్‌గా ప్యాసింజర్

ABN, Publish Date - May 28 , 2024 | 08:14 PM

ఎయిర్ పోర్ట్‌లో ఓ విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ల్యాండ్ అయిపోయింది. ఏదో సాంకేతిక సమస్య తలెత్తిందని అంతా భావిస్తారు.. కానీ..

మెల్‌బోర్న్, మే 28: ఎయిర్ పోర్ట్‌లో ఓ విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ల్యాండ్ అయిపోయింది. మాములుగా అయితే.. సదరు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందువల్లే విమానం వెనక్కి తిరిగివచ్చిందని అంతా భావిస్తారు. కానీ మంగళవారం నాడు ఆస్ట్రేలియాలో అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. పెర్త్ ఎయిర్ పోర్ట్‌ నుంచి మెల్ బో‌ర్న్‌కు విమానం బయలుదేరింది.

Bail Extension Plea: కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఆ కొద్దిసేపటికే గోడకు కొట్టిన బంతిలాగా విమానం వెనక్కి తిరిగి వచ్చి అదే ఎయిర్ పోర్ట్‌లో వాలిపోయింది. ఆ విమానంలో నుంచి ఓ వ్యక్తిని సిబ్బంది బలవంతంగా కిందికి దింపారు. అనంతరం ఆ వ్యక్తిని ఎయిర్ పోర్ట్‌లోని భద్రతా సిబ్బందితోపాటు పోలీసులకు అప్పగించారు. ఇంతకు ఏమైందంటే.. విమానం బయలుదేరిన కొద్ది సేపటికి ఓ ప్రయాణికుడు వస్త్రాలు లేకుండా విమానంలో పరిగెత్తాడు. అసలు ఊహించని ఈ పరిణామంతో విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు.

Mount Everest: నేపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతీయుడు మృతి


Karnataka: మాజీ సీఎంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులకు విమాన సిబ్బంది వివరించారు. దాంతో విమానాన్ని ఆగమేఘాల మీద వెనక్కి తిప్పి.. పెర్త్ ఎయిర్‌పోర్ట్‌లో దింపేశారు. సదరు వ్యక్తికి జూన్ 14వ తేదీన కోర్టులో హాజరుపరిచేలా సమన్లు జారీ చేసేందుకు ఆస్ట్రేలియా పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

VK Pandian: బీజేపీ సెల్ఫ్ గోల్.. బీజేడీకీ లాభం

అతడిని కోర్టు కఠినంగా శిక్షించే అవకాశాలున్నాయి. ఇక సదరు ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విర్జిన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది రక్షణ, భద్రతకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా విర్జిన్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 29 , 2024 | 12:43 PM

Advertising
Advertising