అదానీపై ఆరోపణల వెనుక ఉన్న అమెరికా అటార్నీ రాజీనామా?
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:06 AM
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదు వెనుక ఉన్న అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ జనవరి 10న తన పదవికి రాజీనామా చేయనున్నారు.
వాషింగ్టన్, డిసెంబరు 20: అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదు వెనుక ఉన్న అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ జనవరి 10న తన పదవికి రాజీనామా చేయనున్నారు. అమెరికా అటార్నీ కార్యాలయం తాజాగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ర్టిక్ట్‌కు ఆయన అటార్నీగా వ్యవహరిస్తున్నారు. 53 ఏళ్ల బ్రియాన్ పీస్‌ను 2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనను న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ర్టిక్ట్ అటార్నీగా నియమించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు ఇవ్వడానికి అమెరికాలోని పెట్టుబడిదారుల నిధులను అదానీ గుట్టుచప్పుడు కాకుండా మళ్లించారని ఈ ఏడాది నవంబరులో బ్రియాన్ పీస్ కార్యాలయం అభియోగాలు మోపింది.
Updated Date - Dec 21 , 2024 | 04:06 AM