ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెనడాలో శాశ్వత నివాసం కష్టమే!

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:20 AM

కెనడాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే విదేశీయులకు భారీ షాక్‌ తగిలింది. ‘‘నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇక ఇక్కడే ఉండిపోతాను’’ అంటే కుదరదని కెనడా తేల్చి చెప్పింది.

జాబ్‌ ఆఫర్‌ పాయింట్లు ఎత్తివేసిన సర్కార్‌

ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ విధానంలో మార్పులు

ప్రస్తుత, తాత్కాలిక ఉద్యోగులకూ వర్తింపు

భారతీయులపై భారీ ప్రభావం

టొరంటో, డిసెంబరు 24: కెనడాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే విదేశీయులకు భారీ షాక్‌ తగిలింది. ‘‘నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇక ఇక్కడే ఉండిపోతాను’’ అంటే కుదరదని కెనడా తేల్చి చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ విధానం ద్వారా సంపాయించుకునే జాబ్‌ ఆఫర్‌ పాయింట్లను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. తద్వారా జాబ్‌ ఆఫర్‌ పాయింట్లను ఆధారంగా చేసుకుని శాశ్వత నివాసం కోరేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ విధానంలో కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ మార్పులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ‘‘అభ్యర్థులు ఉద్యోగం పొందినా.. అదనపు పాయింట్లు జోడించినా.. శాశ్వత నివాసం కోసం అభ్యర్థించలేరు’’ అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు శాశ్వత నివాసం కోసం కనీసం 50 పాయిట్లు రావాలి.

కొన్నికొన్నిసార్లు అభ్యర్థుల మధ్య ఈ పాయింట్ల విషయంలో వ్యత్యాసం ఉంటోంది. అయితే, ఈ విషయంలో మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన కెనడా ప్రభుత్వం పూర్తిగా ఈ వ్యవస్థను ఎత్తివేసింది. ఈ మేరకు రిఫ్యూజీస్‌, సిటిజన్‌ షిప్‌ కెనడా(ఐఆర్‌సీసీ) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇప్పటికే దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఐఆర్‌సీసీ పేర్కొంది. కెనడాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ప్రస్తుత నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు. కెనడాలో ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ విధానం ద్వారా ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. తాజా నిర్ణయంతో వారంతా శాశ్వత నివాస అర్హత కోల్పోయినట్టేనని పేర్కొన్నారు. 2023 లెక్కల ప్రకారం 85,760 మంది విదేశీయులు ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ విధానం ద్వారా కెనడాలో ఉద్యోగాలు పొందితే.. వారిలో 40,775 మంది భారతీయులే ఉన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 04:20 AM