Philippines : అమెరికాతో డీల్..ఫిలిప్పీన్స్‌పై చైనా గుర్రు
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:32 AM
అమెరికా నుంచి మధ్యశ్రేణి టైఫూన్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలన్న ఫిలిప్పీన్స్ నిర్ణయంపై చైనా మండిపడింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తమను లక్ష్యంగా చేసుకుంటోందని పరోక్షంగా
బీజింగ్, డిసెంబరు 23: అమెరికా నుంచి మధ్యశ్రేణి టైఫూన్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలన్న ఫిలిప్పీన్స్ నిర్ణయంపై చైనా మండిపడింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తమను లక్ష్యంగా చేసుకుంటోందని పరోక్షంగా విమర్శించింది. ఇటీవల అమెరికా-ఫిలిప్పీన్స్ సంయుక్తంగా వార్షిక మిలటరీ ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే..! ఆ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంలో 480 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే టైఫూన్ క్షిపణులను మోహరించింది. వాటిని అలాగే కొనుగోలు చేయాలని ఫిలిప్పీన్స్ నిర్ణయించింది. దీనిపై ఫిలిప్పీన్స్ మిలటరీ చీఫ్ రాయ్ గాలిడో ఓ ప్రకటన చేశారు.
Updated Date - Dec 24 , 2024 | 06:32 AM