ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bullet Train: గంటకు 450 కి.మీ. వేగం

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:22 AM

గంటకు గరిష్ఠంగా 450కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్‌ రైలును చైనా పరీక్షించింది.

సరికొత్త బుల్లెట్‌ రైలును పరీక్షించిన చైనా

సీఆర్‌ 450గా పేరు.. త్వరలో అందుబాటులోకి

బీజింగ్‌, డిసెంబరు 29: గంటకు గరిష్ఠంగా 450కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్‌ రైలును చైనా పరీక్షించింది. ఈ రైలుకు సీఆర్‌ 450 అని పేరు పెట్టారు. రెండు మూడు నెలల్లో ఇది ప్రయాణ సేవలకు అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డు సృష్టించనుంది. ఈ రైలు సగటున గంటకు 400కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం తియాన్‌జిన్‌, బీజింగ్‌ నగరాల మధ్య ఈ రైలును పరీక్షించారు. అంతకుముందు నవంబరులోనూ దీన్ని పరీక్షించారు. అప్పుడే ఈ రైలు పట్టాలపై వెళ్తున్న వీడియోలు లీక్‌ అయ్యాయి.

Updated Date - Dec 30 , 2024 | 04:23 AM