ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: ‘ఎక్స్‌’ను తొక్కేసేందుకు కుట్ర!

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:46 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హ్యారి్‌సకు చెందిన టీమ్‌.. తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ను తొక్కేయడానికి ప్రణాళికలు రచిస్తోందని ఈలన్‌ మస్క్‌ ఆరోపించారు.

  • కమలాహ్యారిస్‌ టీమ్‌పై మస్క్‌ ఆగ్రహం

  • కమలకు మద్దతుగా నిలిచిన సంస్థకు రూ.420 కోట్ల విరాళం ఇచ్చిన బిల్‌గేట్స్‌

న్యూయార్క్‌, అక్టోబరు 23: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హ్యారి్‌సకు చెందిన టీమ్‌.. తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ను తొక్కేయడానికి ప్రణాళికలు రచిస్తోందని ఈలన్‌ మస్క్‌ ఆరోపించారు. కమల ఎన్నికల ప్రచార బృందంలో.. బ్రిటన్‌కు చెందిన మోర్గాన్‌ మెక్‌స్వీనీ అనే వ్యూహకర్త ఉన్నారు. అతడి నేతృత్వంలో నడుస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ కౌంటరింగ్‌ డిజిటల్‌ హేట్‌ (సీసీడీహెచ్‌)’ అనే సంస్థ ఈ ఏడాది మార్చిలో రూపొందించుకున్న కొన్ని వ్యూహాలకు సంబంధించిన పత్రాలను ‘ద డిజిన్ఫర్మేషన్‌ క్రానికల్‌’ బయటపెట్టింది. అందులో.. ‘కిల్‌ మస్క్స్‌ ట్విటర్‌’ అనే శీర్షికతో సవివర ప్రణాళిక ఉండడం గమనార్హం.


దీన్ని మస్క్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ఎక్స్‌’ను తొక్కేయడం ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి కుట్ర పన్నుతున్నారని.. ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యం అమెరికా చట్టాల ప్రకారం నేరమని పేర్కొన్నారు. మరోవైపు.. ట్రంప్‌, కమలా హ్యారిస్‌ మధ్య ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగుతున్న ఎన్నికల పోరు పతాకస్థాయికి చేరుకుంది! నవంబరు 5న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఇరువురు నేతలూ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. అదే సమయంలో.. అపర కుబేరులైన ఇద్దరు టెక్‌ దిగ్గజాలు వీరిలో చెరొకరికీ తమ మద్దతు ప్రకటించడం విశేషం.


‘స్పేస్‌ఎక్స్‌’, టెస్లా వంటి సంస్థల వ్యవస్థాపకుడు ఈలన్‌ మస్క్‌ చాలాకాలంగా ట్రంప్‌కు అనుకూలంగా ‘ఎక్స్‌’లో వ్యాఖ్యలు చేస్తుండగా.. మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కమలాహ్యారి్‌సకు పరోక్ష మద్దతు ప్రకటించారు. ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ‘ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు 5 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. 5 కోట్ల డాలర్లంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.420 కోట్లు. బిల్‌గేట్స్‌ ఇచ్చిన ఈ విరాళం గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తాసంస్థ వెల్లడించింది. మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నెల రోజులకు పైగా జరుగుతున్న ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియలో ఇప్పటిదాకా 2.1 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Updated Date - Oct 24 , 2024 | 04:46 AM