Elon Musk: సుచిర్ మరణం.. ఆత్మహత్యలా లేదు: మస్క్
ABN, Publish Date - Dec 31 , 2024 | 04:00 AM
కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ‘ఓపెన్‌ఏఐ’ మాజీ ఉద్యోగి, భారతీయ అమెరికన్ సుచిర్ బాలాజీ(26)ది ఆత్మహత్యగా కనిపించడం లేదని లేదని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.
వాషింగ్టన్, డిసెంబరు 30: కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ‘ఓపెన్‌ఏఐ’ మాజీ ఉద్యోగి, భారతీయ అమెరికన్ సుచిర్ బాలాజీ(26)ది ఆత్మహత్యగా కనిపించడం లేదని లేదని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఆయన మరణం వెనుక ఏదో రహస్యం దాగి ఉందని, ఎఫ్‌బీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన తల్లి పూర్ణిమా రామారావు చేస్తున్న డిమాండ్‌ను తాజాగా ‘ఎక్స్’లో సమర్థించారు. ‘ఓపెన్‌ఏఐ’.. చాట్‌జీపీటీకి చెందిన మాతృసంస్థ. దీని వ్యవస్థాపకుల్లో మస్క్ కూడా ఒకరు. కాలక్రమంలో ఆ కంపెనీతో ఆయన తెగతెంపులు చేసుకున్నారు. సుచిర్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్లో గత నెల 26న చనిపోయి కనిపించారు. మరణానికి ముందు.. ఓపెన్‌ఏఐ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైద్యాధికారి తేల్చినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు వెల్లడించారు. అయితే పూర్ణిమ.. ప్రైవేటు దర్యాప్తు సంస్థను నియమించుకుని.. కుమారుడి భౌతిక కాయానికి రెండోసారి పోస్టుమార్టం చేయించారు. అందులో సుచిర్‌ది ‘ఆత్మహత్య’ కాదని తేలిందన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 04:00 AM