Elon Musk: డ్రగ్స్ వాడకం గురించి ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
ABN, Publish Date - Mar 19 , 2024 | 01:42 PM
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో మస్క్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రకటన చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. తాను డిప్రెషన్ వంటి ఆందోళనలు తగ్గించుకునేందుకు కెటామైన్(Ketamine) డ్రగ్ తీసుకుంటానని చెప్పారు. దానిని తీసుకున్నప్పుడు తన మానసిక స్థితి మెరుగవుతుందని అన్నారు. ఆ క్రమంలో టెస్లా యజమాని ప్రతి వారం కొద్ది మొత్తంలో కెటామైన్‌ను వాడుతున్నట్లు వెల్లడించారు. కానీ ఆ డ్రగ్‌ను తన ఇష్టానుసారం కాకుండా వైద్యుల సలహా మేరకే తీసుకుంటానని స్పష్టం చేశారు. జర్నలిస్ట్ డాన్ లెమన్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే తాను మద్యం సేవించనని, పొగతాగడం ఇష్టం లేదని ఎలాన్ మస్క్(Elon Musk) అన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఒప్పందాలు లేదా పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని పేర్కొన్నారు. టెస్లా(tesla) కంపెనీ నిర్వహణలో భాగంగా ఈ డ్రగ్ వినియోగం ఉపయోగపడిందని తెలిపారు. గతంలో ఓసారి మానసికంగా కుంగుబాటుకు లోనైన సమయంలో ఈ డ్రగ్ వినియోగం ఊరటనిచ్చిందని వెల్లడించారు. అంతేకాదు ఏదైనా తీసుకోవడం వల్ల మీ పనితీరు మెరుగుపడితే దానిని కొనసాగించాలని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కెటామైన్‌ను ఎక్కువగా వాడితే పని చేయడం కష్టంగా మారుతుంది. అంతేకాదు ఎలాన్ మాస్క్‌కు పని భారం(work load) కూడా చాలా ఎక్కువ. అతను సాధారణంగా రోజుకు 16 గంటలు పని చేస్తాడు. మరోవైపు మాస్క్ డ్రగ్స్ వాడకం పట్ల టెస్లా స్పేస్‌ఎక్స్(spacex)లోని చాలా మంది బోర్డు సభ్యులు, ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రమంగా ఎలాన్ మస్క్ ఆరోగ్యం, వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: ఇంటి ముందు కార్ పార్క్ చేసిన జంటపై దాడి.. ముగ్గురు అరెస్టు
Updated Date - Mar 19 , 2024 | 01:42 PM