Elon Musk: రాత్రికి రియల్ ట్రంప్‌ను చూస్తారు.. ఎలాన్ మస్క్ సెన్సేషనల్ ట్వీట్..
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:37 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళుతున్నారు. అధ్యక్ష పీఠానికి కేవలం అడుగు దూరంలో ఉన్నారు. మరో 31 ఎలక్టోరల్ ఓట్లు గెల్చుకుంటే వైట్ హౌస్ లోకి ట్రంప్ ఎంట్రీ కన్ఫామ్ అయినట్లేనని తెలుస్తుంది. స్వింగ్ స్టేట్స్ ఏడింటిలో ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ హవానే కొనసాగుతుంది. కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలోనూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ లీడ్ లో ఉన్నారు. 239 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ కైవసం చేసుకోగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఇప్పటి వరకు కేవలం 179 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే గెలుచుకున్నారు.
సెన్సేషనల్ ట్విట్..
డొనాల్డ్ ట్రంప్ లీడ్‌లో దూసుకెళ్తుండగా, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో స్పందించారు. "మార్పు కోసం స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు.. ఈ రాత్రి అమెరికన్ ప్రజలు రియల్ ట్రంప్‌ను చూస్తారు.." అని ఎలోన్ మస్క్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. అంతకుముందే "గేమ్, సెట్ అండ్ మ్యాచ్" అని పోస్ట్ చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో టెన్నిస్ మ్యాచ్‌లో ఓ ఆటగాడు గెలిచాడని చెప్పడానికి ఎక్కువగా ఈ పదాలు వాడుతుంటారు.
కాగా, ఎన్నికల్లో మస్క్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ఫిలడెల్ఫియా ప్రాంతంలో ట్రంప్ కు మద్దతుగా అక్టోబర్ 17న తన తొలి వ్యక్తిగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రంప్ పాలనలో చోటుచేసుకున్న ముఖ్యమైన అంశాలను, రాజకీయ పరిస్థితులను, తాను ఎందుకు ట్రంప్ కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో తన అభిప్రాయాలను ఆ కార్యక్రమంలో వివరించారు.
వివాదంలో ఎలాన్ మస్క్..
స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఎలాన్ మస్క్ ఎలక్షన్ గివ్ అనే కింద ప్రైజ్ మనీని ప్రకటించిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్రం, ప్రతి ఒక్కరికి గన్ కలిగి ఉండే హక్కుక్కు మద్దతుగా సంతకం చేసిన ఓటరుకు 100 డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తానని తెలిపారు. అలాగే మరో ఓటరును సిఫార్సు చేస్తే 47 డాలర్లు ఇస్తామని వెల్లడించారు. అయితే, ఈ విషయంపై ప్రస్తుతం వివాదం కొనసాగుతుంది. ముందుగానే నిర్ణయించిన వ్యక్తులకే ప్రైజ్ మనీ ఇస్తున్నారని, తమను మోసం చేశారంటూ టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆరిజోనా నివాసి జాక్వెలిప్ మెక్ అఫెర్జీ అనే మహిళ ఫిర్యాదు చేశారు.
Also Read:
అమెరికా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే 7 స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలు ఇవే
తాజ్‌మహల్ సమీపంలోని పార్కు ఓ రైతు స్వాధీనంలోకి!
For More National News
Updated Date - Nov 06 , 2024 | 12:38 PM