Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలనం
ABN, Publish Date - Aug 03 , 2024 | 10:30 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. ప్రత్యర్థి డెమోక్రట్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. పనిలో పనిగా కార్పొరేట్ బాస్‌లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకెళుతున్నారు. ప్రత్యర్థి డెమోక్రట్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. పనిలో పనిగా కార్పొరేట్ బాస్‌లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఏం జరిగిందంటే..?
డొనాల్డ్ ట్రంప్‌పై జూలై 13వ తేదీన మర్డర్ అటెంప్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. ఆ ఘటన గురించి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో చాలాసార్లు మాట్లాడారు. అదే విషయాన్ని ట్రంప్ ఫాక్స్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
జుకర్ బర్గ్ కాల్ చేశారు..
‘ఆ రోజు నాపై దాడి జరిగింది. మెటా సీఈవో జుకర్ బర్గ్ నాతో మాట్లాడారు. ఆ దాడి నుంచి అదృష్టవశాత్తు బయటపడ్డారు. అద్భుతం జరిగింది. మీరు చాలా ధైర్యవంతులు. ఆ సమయంలో జుకర్ బర్గ్ నాకు అమితమైన గౌరవం ఇచ్చారు. డెమోక్రాట్లకు మద్దతు ఇవ్వనని నాతో చెప్పారు. నేను అంటే జుకర్ బర్గ్‌కు గౌరవం అయినందున డెమోక్రట్లకు సపోర్ట్ చేయనని ప్రకటించారు. ఫొటో షేరింగ్ అంశంపై మరి మరి క్షమాపణ చెప్పారు. తప్పు చేశారు, క్షమాపణ చెప్పి దానిని సరిదిద్దుకున్నారు. కానీ గూగుల్ స్పందించలేదు. ఇంతవరకు ఆ కంపెనీ నుంచి ఏ ఒక్కరు నాకు క్షమాపణ చెప్పలేదు అని’ డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్2తో మాట్లాడి చెప్పారు.
టాప్ కంపెనీల సీఈవోల మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్, డెమోక్రటిక్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని జూలై నెలలో మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనదలచుకోలేదని స్పష్టం చేశారు. ఇంతలో ట్రంప్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్, బెన్ హోరోవిట్జ్ డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. టాప్ కంపెనీల సీఈవోల మద్దతును డొనాల్డ్ ట్రంప్ కూడగట్టేశారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడమే మిగిలి ఉంది.
Read Latest International News and Telugu News
Updated Date - Aug 03 , 2024 | 10:30 AM