ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Plane Crash: కుప్ప కూలిన విమానం..బాలుడితో సహా ఐదుగురు మృతి

ABN, Publish Date - Mar 11 , 2024 | 09:43 AM

ఓ గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ చిన్న ప్రైవేట్ విమానం కూప్పకూలింది. దీంతో విమానంలో ఉన్న ఐదుగురు మరణించారు.

ఓ గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ చిన్న ప్రైవేట్ విమానం కూప్పకూలింది(plane crash). దీంతో విమానంలో ఉన్న ఐదుగురు మరణించారు. ఈ ఘటన అమెరికా(america)లోని వర్జీనియా(virginia)లో చోటుచేసుకుంది. ప్రమాదంలో పైలట్‌, ఓ చిన్నారితో పాటు మరో ముగ్గురు చనిపోయారు. ట్విన్ ఇంజిన్ IAI ఆస్ట్రా 1125 ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు వెంబడి చెట్లను ఢీకొట్టిందని వర్జీనియా స్టేట్ పోలీసులు వెల్లడించారు.


ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు(fire) చెలరేగాయని అక్కడి పోలీసులు(police) వెల్లడించారు. ఆ క్రమంలో ప్రమాదం జరిగిన ప్రదేశం మొత్తం దగ్ధమైంది. అయితే వారంతా ఎక్కడికి వెళుతున్నారు. ఎందుకోసం ప్రయాణిస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదం సంభవించిన ప్రాంతం వర్జీనియా రాజధాని రిచ్‌మండ్‌కు పశ్చిమాన 165 మైళ్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Madhya Pradesh: ఫ్యామిలీ ఫంక్షన్‌లో షాకింగ్ ఘటన.. సంగీతం ఆపిన పాపానికి అన్నయ్యనే..

Updated Date - Mar 11 , 2024 | 09:46 AM

Advertising
Advertising