ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sheikh Hasina: హసీనాను వెంటాడుతున్న కష్టాలు.. మరో 3 కేసుల్లో ఇరుకున్న మాజీ ప్రధాని..

ABN, Publish Date - Aug 19 , 2024 | 11:13 AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య 12కు చేరింది.

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య 12కు చేరింది. రిజర్వేషన్ల ఉద్యమంలో ఆందోళనకారులపై దాడి, 2015లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియాపై దాడి, విద్యార్థి మృతికి సంబంధించిన కేసులు ఆమెపై నమోదయ్యాయి. 2013లో జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదుచేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య పెరిగాయి. ప్రస్తుతం షేక్ హసీనా ఏయే కేసులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం.


కాలేజీ విద్యార్థుల మృతి కేసు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా రెండు వేర్వేరు కళాశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో షేక్ హసీనాపై కేసు నమోదైంది. ఢాకాలోని సూత్రాపూర్ ప్రాంతంలో జరిగిన హింసాకాండలో ఇద్దరు విద్యార్థుల హత్యకు సంబంధించి హసీనాతో పాటు మరో 12 మందిపై కేసు నమోదైంది. జులై 19న ఇద్దరు విద్యార్థులు కోబి, షహీద్ సుహ్రావర్ది కాలేజీ ముందు వందలాది మందితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, అవామీ లీగ్ మద్దతుదారులు విద్యార్థులిద్దరినీ కాల్చిచంపారు. ఈ విషయమై ఢాకా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు.


ఖలీదా జియాపై దాడి..

2015లో బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా కాన్వాయ్‌పై జరిగిన దాడిలో తనతోపాటు మరో 113 మంది ప్రమేయం ఉందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత బలాల్ హుస్సేన్ షేక్ హసీనాపై కేసు పెట్టారు. వీరితో పాటు మరో 500 నుంచి 700 మంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. దీని ఎఫ్‌ఐఆర్ ఢాకాలోని తేజ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది.


విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో..

ఆగస్ట్ 4న బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో 18 ఏళ్ల కళాశాల విద్యార్థి నజీబుల్ సర్కార్ మరణించడంపై విద్యార్థి తండ్రి మజిదుల్ సర్కార్ జాయ్‌పూర్‌హాట్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో అవామీ లీగ్ నాయకుడు, మాజీ రోడ్డు రవాణా శాఖ మంత్రితో పాటు మరో 128 మంది పేర్లను పేర్కొన్నారు.


సామూహిక హత్య ఆరోపణలపై

బంగ్లాదేశ్ పీపుల్స్ పార్టీ (బిపిపి) అధ్యక్షుడు బాబుల్ సర్దార్ చఖారీ తరపున ఢాకా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 2013లో షాప్లా ఛత్తర్‌లో ఇస్లామిక్ సంస్థ హిఫాజత్-ఎ-ఇస్లాం నిర్వహించిన ర్యాలీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ప్రజలను సామూహికంగా చంపినందుకు షేక్ హసీనాతో పాటు మరో 33 మందిపై కేసు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు.


హసీనాపై ఇప్పటివరకు..

తాజా కేసులతో కలిపి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 12కి చేరింది. వీటిలో తొమ్మిది హత్య కేసులు, ఒక కిడ్నాప్ కేసు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ నెల 5న జరిగిన తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా భారత్‌కు వచ్చారు. ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్‌లో హత్య, కిడ్నాప్, జాతి ప్రక్షాళన కేసులను ఎదుర్కొంటున్నారు. గ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 230 మందికి పైగా మరణించారు. అదే సమయంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వివాదాస్పద రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu Latest News Click Here

Updated Date - Aug 19 , 2024 | 11:33 AM

Advertising
Advertising
<