జర్మనీలో సైకియాట్రిస్ట్ దుర్మార్గం
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:34 AM
జర్మనీలో ఓ సైకియాట్రిస్ట్ సైకోగా మారాడు. క్రిస్మస్ సందర్భంగా మగ్డేబర్గ్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న పౌరులపైకి విచక్షణారహితంగా.. అతి వేగంతో కారుతో దూసుకెళ్లాడు.
కారుతో క్రిస్మస్ మార్కెట్‌పైకి దూసుకెళ్లిన డాక్టర్
ఐదుగురి మృతి..200 మందికి గాయాలు
మగ్డేబర్గ్, డిసెంబరు 21: జర్మనీలో ఓ సైకియాట్రిస్ట్ సైకోగా మారాడు. క్రిస్మస్ సందర్భంగా మగ్డేబర్గ్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న పౌరులపైకి విచక్షణారహితంగా.. అతి వేగంతో కారుతో దూసుకెళ్లాడు. సుమారు 400 మీటర్ల దూరం వరకు అతని అరాచకం కొనసాగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా.. ఐదుగురు పౌరులు మృతిచెందారు. 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని సౌదీ అరేబియాకు చెందిన తాలెబ్.ఎ.బెర్లిన్ అనే 50 ఏళ్ల వయసున్న సైకియాట్రి్‌స్ట/సైకోథెరపి్‌స్టగా గుర్తించారు.
Updated Date - Dec 22 , 2024 | 02:35 AM