ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

H-1B Visa : హెచ్‌-1బీ రూల్స్‌ సరళతరం

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:22 AM

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయులకు ఇదో తీపికబురు! అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను సులభంగా నియమించుకునే అవకాశం కల్పిస్తూ జో బైడెన్‌

ఎఫ్‌-1ను హెచ్‌-1బీగా మార్చుకునే చాన్స్‌.. బైడెన్‌ నిర్ణయం.. జనవరి 17 నుంచి అమలు

లక్షల మంది భారత ఐటీ నిపుణులకు లబ్ధి

వాషింగ్టన్‌, డిసెంబరు 18: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయులకు ఇదో తీపికబురు! అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను సులభంగా నియమించుకునే అవకాశం కల్పిస్తూ జో బైడెన్‌ ప్రభుత్వం వీసా నిబంధనలను సరళతరం చేసింది. ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలను హెచ్‌-1బీ వీసాలుగా సులభంగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షల మంది భారత ఐటీ నిపుణుల అమెరికా కల సాకారం కానుంది. ప్రస్తుతం ఉన్న హెచ్‌-1బీ వీసాలు నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాలు. వీటి ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను ప్రత్యేకమైన పనులకు నియమించుకుంటున్నాయి. ఏటా ఇలా భారత్‌, చైనా సహా విదేశాల నుంచి వేల మందిని ఐటీ కంపెనీలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు చేసిన వీసా నిబంధనల సరళీకరణతో మరింత మందికి అవకాశం కల్పించే చాన్స్‌ ఉందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) ప్రకటించింది. తాజా సరళీకరణ ప్రకారం లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థల నిర్వచనం, నిబంధనల్లో మార్పు చేశారు. ఆయా సంస్థలు ఇక నుంచి వార్షిక హెచ్‌-1బీ వీసాల చట్టపరమైన పరిమితి నుంచి మినహాయింపు పొందనున్నాయి. ప్రస్తుతం చట్ట బద్ధంగా ఏడాదికి 65 వేల హెచ్‌-1బీ వీసాలను అనుమతిస్తున్నారు. అడ్వాన్స్‌ డిగ్రీలు ఉన్న మరో 20 వేల మందికి ఇస్తున్నారు. అయితే, ఇక నుంచి పలు సంస్థలను ఈ పరిమితి నుంచి మినహాయించనున్నారు. ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విద్యార్థులకు కూడా ఈ నిబంధన వర్తించనుంది. ఇక, గతంలోనే హెచ్‌-1బీ వీసాలు కలిగి ఉన్న వారి పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించనున్నారు. ఈ నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు హెచ్‌-1బీ వీసాలను లాటరీ విధానంలో ఏటా ఒకసారి(ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో) ఇస్తున్నారు. దీంతో ఎంతో మంది ఆశావహులు ఈ లాటరీ తగలక నీరుగారుతున్నారు. ఇప్పుడు నిబంధనల సరళీ కరణతో ఎక్కువ మంది అవకాశం లభించనుంది.

Updated Date - Dec 19 , 2024 | 05:22 AM