Sri Lanka: శ్రీలంక కొత్త ప్రధాన మంత్రిగా హరిణి అమరసూర్య
ABN, Publish Date - Sep 24 , 2024 | 04:46 PM
శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో సోషల్ స్టడీస్ విభాగం సీనియర్ లెక్చరర్ అయిన అమరసూర్య 2020లో నేషనల్ పీపుల్స్ పవర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి హోదాలో న్యాయం, విద్య, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా ఆమె నిర్వహించనున్నారు.
కొలంబో: నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) ఎంపీ, హక్కుల కార్యకర్త, యూనివిర్శిటీ లెక్చరర్ హరిణి అమరసూర్య (Harini Amarasuriya)ను శ్రీలంక (Sri Lanka) నూతన ప్రధానమంత్రి (New Prime Minister)గా దేశాధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే మంగళవారంనాడు నియమించారు. దీంతో శ్రీలంక 16వ ప్రధాన మంత్రిగా, మూడో మహిళా ప్రధానిగా అమరసూర్య గుర్తింపు పొందారు. గత శనివారంనాడు జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే గెలుపొందారు.
Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణ స్వీకారం
శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో సోషల్ స్టడీస్ విభాగం సీనియర్ లెక్చరర్ అయిన అమరసూర్య 2020లో నేషనల్ పీపుల్స్ పవర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి హోదాలో న్యాయం, విద్య, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా ఆమె నిర్వహించనున్నారు. లిబరల్ భావజాలం కలిగి ఆమె లింగ అసమానతలు, నిరుద్యోగం, శిశు సంరక్షణ, దేశ విద్యావ్యవస్థలో లోపాలు వంటి కీలక అంశాలపై చేసిన రీసెర్చ్ వర్క్ పలువురి ప్రశంసలు అందుకుంది.
Read MoreInternational News and Latest Telugu News
Updated Date - Sep 24 , 2024 | 04:46 PM